AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్10లో ఊహించని ట్విస్టులు.. హౌస్ నుంచి ఆమె అవుట్.! మారొకరు కూడా

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ఆసక్తికరంగానూ, రసవత్తరంగానూ సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.

బిగ్‌బాస్10లో ఊహించని ట్విస్టులు.. హౌస్ నుంచి ఆమె అవుట్.! మారొకరు కూడా
Bigg Boss 10
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2026 | 1:10 PM

Share

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్ ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలైతే  షాలిని హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా.. బిగ్‌బాస్ ఆమెను సీక్రెట్ రూమ్‌కి పంపించారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని తిరిగి హౌస్‌లోకి తీసుకురావడంతో ఈ వారం ఆమె నామినేషన్ల నుంచి సేవ్ అయిపొయింది. షాలిని గత వారం ఎలిమినేట్ కాకపోవడంతో, ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే మొదటి వికెట్ పడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో పలువురు కంటెస్టెంట్లు ప్రమాదంలో చిక్కుకున్నారు.

నామినేషన్లలో ఉన్న సభ్యులు: రోహిత్‌, త్రిగుణ్‌, రామకృష్ణ, అమన్‌, శ్వేత నాయుడు, వర్షిణి, వంశీ, సుధీర్‌, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్‌. హౌస్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘గోట్’ టాస్క్‌లో గెలిచిన అమన్‌, త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, నీతూ మాస్టర్‌లు ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా నామినేషన్ల నుంచి పూర్తిగా సేవ్ అయ్యారు. అలరించడానికి వచ్చిన కంటెస్టెంట్లకు సంబంధించి తాజా ఓటింగ్ సరళి చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఓటింగ్ పరంగా రోహిత్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాతి స్థానాల్లో త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్‌, వంశీ వరుస క్రమంలో కొనసాగుతున్నారు. ఇక ఓటింగ్‌లో చివరి స్థానాల్లో శ్వేత నాయుడు, నీతూ మాస్టర్, దక్షి, శివ నిలిచారు. అయితే, నీతూ మాస్టర్ ఇప్పటికే గోట్ టాస్క్ ద్వారా సేవ్ అయిపోవడంతో ఆ టెన్షన్ నుంచి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతానికి శివ, దక్షి, శ్వేత నాయుడు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్లలో సోషల్ మీడియా సమాచారం ప్రకారం దక్షి తొలి ఎలిమినేషన్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత వారం షాలిని ఎలిమినేట్ కాకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ కేవలం దక్షి ఎలిమినేషన్‌తోనే సరిపెడతారా.? లేదంటా డేంజర్ జోన్‌లో ఉన్న మరో కంటెస్టెంట్‌ను కూడా బయటకు పంపి మరో ఎలిమినేషన్ సర్ప్రైజ్ ఇస్తారా అనేది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హౌస్ నుంచి ఆమె అవుట్.!
హౌస్ నుంచి ఆమె అవుట్.!
గదిలో వేసే సీలింగ్ లైట్లు మీనిద్రను ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా
గదిలో వేసే సీలింగ్ లైట్లు మీనిద్రను ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్‌ ఫోన్‌!
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్‌ ఫోన్‌!
ధంతేరాస్‌న బంగారం, వెండే కాదు.. ఈ గింజలు కొన్నా అదృష్టమే అదృష్టం
ధంతేరాస్‌న బంగారం, వెండే కాదు.. ఈ గింజలు కొన్నా అదృష్టమే అదృష్టం
ఫేస్‌వాష్‌ను ఎంత మోతాదులో వాడాలి?ముఖం కడుక్కునే సరైన పద్ధతి ఏంటి?
ఫేస్‌వాష్‌ను ఎంత మోతాదులో వాడాలి?ముఖం కడుక్కునే సరైన పద్ధతి ఏంటి?
ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా తినండి
ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా తినండి
అమెరికాలో నార్త్ ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!
అమెరికాలో నార్త్ ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!
బీహెచ్‌ఈఎల్‌లో 660 ఉద్యోగాలు.. ఐటీఐ అభ్యర్థులకు మంచి అవకాశం!
బీహెచ్‌ఈఎల్‌లో 660 ఉద్యోగాలు.. ఐటీఐ అభ్యర్థులకు మంచి అవకాశం!
టీమిండియా @ 300 మ్యాచ్.. ప్రపంచంలోనే తొలి టీంగా రికార్డ్..?
టీమిండియా @ 300 మ్యాచ్.. ప్రపంచంలోనే తొలి టీంగా రికార్డ్..?
జియో ఐపీఓలో రికార్డుల మోత.. రూ.7.40 లక్షల కోట్లకు చేరిన బిడ్లు..
జియో ఐపీఓలో రికార్డుల మోత.. రూ.7.40 లక్షల కోట్లకు చేరిన బిడ్లు..