AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ సినిమాకు తీరని లోటు.. లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు శనివారం రాత్రి కన్నుమూశారు. వెండితెరపై ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేసిన ఆ లెజెండరీ దర్శకుడి మరణంపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఆయన నిష్క్రమణతో చిత్రసీమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందంటూ సినీ ప్రముఖులు భావోద్వేగ ట్వీట్స్ చేశారు.

భారతీయ సినిమాకు తీరని లోటు.. లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
Singeetham Srinivas Rao
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2026 | 11:20 AM

Share

ఎల్లలు దాటిన తన ఆలోచనలతో దశాబ్దాల క్రితమే పాన్‌ ఇండియా సినిమాకు నిర్వచనం చెప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం సినిమాతో అసలు సంభాషణ లేకుండా కేవలం సంగీతం ద్వారానే వెండితెరపై మరో ప్రయోగం చేశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు.. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేవీరెడ్డి కాలంలో సినీ ప్రస్థానం మొదలెట్టిన సింగీతం శ్రీనివాసరావు… ఇటీవల 94ఏళ్ల వయసులోనూ మెగాఫోన్‌ పట్టుకుని సినిమా పట్ల తన మక్కువ చాటిచెప్పారు. చివరిదాకా వినూత్న ఆలోచనలకే కేంద్రంగా బతికిన దర్శక దిగ్గజం… దివికి ఎగిసింది. ఇన్నాళ్లు అనేక ప్రయోగాలతో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఆయన ఇక సెలవంటూ అనంత లోకాలకు వెళ్లిపోయారు.

సింగీతం శ్రీనివాస రావు మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మేమిద్దరం కలిసి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను అందించాము. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే ఒక కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369’; తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారిత చిత్రమై, బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన ‘భైరవ ద్వీపం’; పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’. ఈ మూడు చిత్రాల ద్వారా, ఒకే దర్శకుడి సారథ్యంలో నేను సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్‌లలోని పాత్రలను పోషించాను. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. మా నాన్నగారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన చిరస్మరణీయ చిత్రం ‘మాయాబజార్’ కోసం గొప్ప దర్శకుడు కె.వి. రెడ్డి గారి వద్ద సింగీతం గారు సహాయకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత, ఆయన మా నాన్నగారి అనేక చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారు. అందువల్ల, మా కుటుంబానికి ఆయనతో సినిమా రంగానికి అతీతమైన ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది.

సింగీతం గారు అన్ని విధాలా అసలు సిసలు దిగ్గజ దర్శకుడు. ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి శ్వాస వరకు వివిధ భారతీయ భాషలలో మరపురాని సినిమా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు, భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సింగీతం గారి కుటుంబ సభ్యులకు మా నందమూరి కుటుంబం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.

సింగీతం శ్రీనివాసరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. “ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు.

సీఎం చంద్రబాబు ట్వీట్..

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్..

సీఎం రేవంత్ రెడ్డి..

వెంకయ్య నాయుడు ట్వీట్..

చిరంజీవి ట్వీట్..

దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్..

లోకేష్ నారా ట్వీట్..

విజయ్ దేవరకొండ ట్వీట్..

మహేష్ బాబు ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

Follow Us
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..