ఇంట్లోనే పీతాంబరి పౌడర్ తయారు చేయడం ఎలా? రాగి, ఇత్తడి పాత్రలను మెరిపించే సింపుల్ ఫార్ములా
ఇళ్లలో పూజల కోసం ఉపయోగించే ఇత్తడి, రాగి పాత్రలు, దీపాలు, విగ్రహాలు కొద్ది రోజులు గడిచేసరికి గాలికి స్పందించి నల్లగా మారుతుంటాయి. వాటిపై పేరుకున్న మురికి, నలుపును వదిలించడానికి మార్కెట్లో లభించే పీతాంబరి పౌడర్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే, ఖరీదైన క్లీనింగ్ పౌడర్‌లకు బదులు, ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతో అచ్చం అలాంటిదే అయిన శక్తివంతమైన క్లీనింగ్ పౌడర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ ఫార్ములా, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇళ్లలోని రాగి, ఇత్తడి పాత్రలు, పూజా విగ్రహాలు కాలక్రమేణా నల్లగా మారి తమ మెరుపును కోల్పోతుంటాయి. వీటిని తళతళ మెరిపించడానికి ఇంట్లోనే సులభంగా సహజమైన క్లీనింగ్ పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో ఇత్తడి వస్తువులను సులభంగా శుభ్రం చేయవచ్చు. అయితే, సున్నితమైన నగిషీలు ఉన్న విగ్రహాలపై లేదా యాంటిక్ వస్తువులపై దీనిని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పీతాంబరి పౌడర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఉపయోగించే విధానం ఇప్పుడు చూద్దాం..
ఈ క్లీనింగ్ మిశ్రమం తయారీకి కొన్ని సాధారణ వస్తువులు సరిపోతాయి.
పావు కప్పు ఉప్పు
పావు కప్పు సిట్రిక్ యాసిడ్ పౌడర్
పావు కప్పు గోధుమ పిండి
పావు కప్పు బట్టలుతికే డిటర్జెంట్ పౌడర్
రంగు కోసం 2-3 చుక్కలు రెడ్ ఫుడ్ కలర్
తయారీ విధానం:
ఒక పొడి గిన్నెలో ఉప్పు, సిట్రిక్ యాసిడ్ పౌడర్, గోధుమ పిండిని వేయాలి. ఆ తర్వాత అందులోనే డిటర్జెంట్ పౌడర్‌ను కలిపి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. మీకు మార్కెట్లో దొరికే పీతాంబరి లాంటి రంగు కావాలనుకుంటే కొన్ని చుక్కల రెడ్ ఫుడ్ కలర్ కలపవచ్చు. ఈ పౌడర్‌ను ఒక గాలిచొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీనిని చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం ముఖ్యం.
పాత్రలు, విగ్రహాలను శుభ్రం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రాగి లేదా ఇత్తడి పాత్రలను ఈ పౌడర్‌తో శుభ్రం చేసిన తర్వాత, వెంటనే ఒక పొడి కాటన్ గుడ్డతో తుడిచివేయాలి. తడి మిగిలితే వాటిపై మళ్లీ త్వరగా మరకలు ఏర్పడతాయి. సున్నితమైన శిల్పాలు, ఎక్కువ నగిషీలు ఉన్న విగ్రహాలపై ఈ పౌడర్‌ను నేరుగా రుద్దకుండా, మెత్తటి బ్రష్‌ను ఉపయోగించి సున్నితంగా క్లీన్ చేయాలి.
సిట్రిక్ యాసిడ్ చాలా శక్తివంతమైనది కాబట్టి, దీనిని సున్నితమైన లేదా యాంటిక్ వస్తువులపై వాడకపోవడమే మంచిది. అలాగే చేతులకు గ్లౌజులు ధరించి ఈ పౌడర్‌ను ఉపయోగించడం సురక్షితం.




