AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌లో గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్ టాస్క్.. చివర్లో ఊహించని ట్విస్ట్.. నరేష్, శివ్ కన్నీళ్లు!

బిగ్ బాస్ ఇంట్లో గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్ టాస్క్ ఉత్కంఠగా సాగింది. చివరి వరకు నిలిచిన నరేష్‌కు షాక్ తగలగా, అమన్, నీతూ, దేబ్జానీ గోట్ హోదాతో నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. అలాగే ముకేశ్, శివ్ మధ్య గొడవ జరిగింది.

బిగ్ బాస్‌లో గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్ టాస్క్.. చివర్లో ఊహించని ట్విస్ట్.. నరేష్, శివ్ కన్నీళ్లు!
Bigg Boss10
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2026 | 7:23 AM

Share

బిగ్ బాస్ ఇంట్లో గురువారం ఎపిసోడ్‌లో ‘గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్’ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఎల్లో టీమ్‌లోని కంటెస్టెంట్లకు గ్రీన్ జోన్‌లోకి వెళ్లేందుకు బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. ఈ టాస్క్‌లో చివరి వరకు నిలబడటమే కాకుండా, బరువును ఎక్కువసేపు మోయడం కంటెస్టెంట్లకు పెద్ద సవాల్‌గా మారింది. తొలుత ఈ గేమ్‌కు శ్వేతను సంచాలక్‌గా నియమించాడు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ సభ్యులు ఎల్లో టీమ్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూచించిన వెయిట్స్‌ను తగిలించాలి. ఈ క్రమంలో సంచాలక్ పిలిచిన కంటెస్టెంట్‌కు నిర్ణీత బరువును జత చేస్తూ ఆటను కొనసాగించారు. అయితే మొదట్లోనే ఆర్కేకు అవకాశం ఇవ్వగా.. అతడు నాలుగు వెయిట్స్‌ను వర్షిణికి తగిలించడంతో ఆమెపై భారం పెరిగింది.

ఈ టాస్క్‌లో శివ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణిలను ఎక్కువగా టార్గెట్ చేశారు. మరోవైపు ముకేష్, నరేష్, రామ్ ప్రసాద్, అమన్‌లకు తొలుత పెద్దగా వెయిట్స్ వేయలేదు. ముఖ్యంగా ముకేష్, రోహిత్ గ్యాంగ్ శివ్, త్రిగుణ్‌లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. వర్షిణి ఎక్కువ బరువును మోయలేక ముందుగానే కుప్పకూలిపోయింది. కళ్లు తిరిగి కిందపడటంతో టాస్క్ మరింత ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత శివ్ సుమారు 32 కిలోల బరువును మోస్తూ అందరి టార్గెట్‌గా నిలిచాడు. చివరకు అతడు కూడా భారాన్ని తట్టుకోలేక ఆట నుంచి తప్పుకున్నాడు. నీతూ సైతం చాలాసేపు వెయిట్స్ మోసిన తర్వాత టాస్క్‌ను వదిలేసింది.

ఇక త్రిగుణ్‌పై కూడా వెయిట్స్ పెరుగుతూనే వచ్చాయి. రోహిత్, సుధీర్, షాలినీ అతడిని ఎక్కువగా టార్గెట్ చేయడంతో చివరకు త్రిగుణ్ కూడా ఆట నుంచి తప్పుకున్నాడు. అనంతరం శివ్, త్రిగుణ్‌లు ముకేష్‌ను టార్గెట్ చేయగా.. అతడు కూడా టాస్క్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అమన్, రామ్ ప్రసాద్, నరేష్ మిగిలిన సమయంలో వంశీ, శ్వేత వెయిట్స్‌ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతసేపటికి రామ్ ప్రసాద్ కూడా ఆట నుంచి తప్పుకోవడంతో అమన్, నరేష్ మాత్రమే మిగిలారు. ఈ దశలో ఎక్కువమంది అమన్‌కు వెయిట్స్ వేస్తూ అతడిని టార్గెట్ చేశారు. రామ్ ప్రసాద్, ముకేష్, శివ్ తదితరులు అమన్‌పై బరువును పెంచడంతో అతడికి పరిస్థితి మరింత కష్టంగా మారింది. మరోవైపు నరేష్‌కు మాత్రం తక్కువ వెయిట్స్ వేయడంతో అతడు చివరి వరకు నిలబడగలిగాడు.

అయితే తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని, అందరూ తననే టార్గెట్ చేశారని అమన్ బాధపడ్డాడు. మరోవైపు ముకేష్, శివ్ మధ్య వ్యక్తిగత వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. శివ్‌ను ఉద్దేశించి ముకేష్ చేసిన వ్యాఖ్యలు అతడిని భావోద్వేగానికి గురిచేశాయి. ‘లవర్ బాయ్’, ‘లైలా మజ్ను’ అంటూ ముకేష్ చేసిన కామెంట్స్‌తో శివ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఊహించని అనౌన్స్ మెంట్ చేశాడు. చివరి వరకు నిలిచిన నరేష్ మాత్రమే విజేత కాదని స్పష్టం చేస్తూ.. అత్యధిక బరువును మోసిన అమన్‌కు ‘గోట్’ హోదా దక్కుతుందని ప్రకటించాడు. అలాగే అత్యధిక బరువును మోసిన మహిళా కంటెస్టెంట్‌గా నీతూ, ఎక్కువసేపు వెయిట్స్ మోసిన కంటెస్టెంట్‌గా దేబ్జానీకి కూడా గోట్ హోదా లభించినట్లు వెల్లడించాడు. ఈ ముగ్గురూ వచ్చే వారం నామినేషన్ల నుంచి సేఫ్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించడంతో అమన్, నీతూ, దేబ్జానీ సంతోషంలో మునిగిపోయారు. అయితే చివరి వరకు టాస్క్‌లో నిలిచినప్పటికీ తనకు గోట్ హోదా దక్కకపోవడంతో నరేష్ తీవ్రంగా నిరాశ చెందాడు. తాను వెయిట్స్ మోయలేనని, ఇలాంటి టాస్క్ ఆడటం తనకు కష్టమని అందరికీ తెలుసని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముందుగానే ఆ విషయం చెప్పి ఉంటే తాను టాస్క్ నుంచి తప్పుకునేవాడినని, కనీసం రామ్ ప్రసాద్ అయినా ఆ అవకాశాన్ని అందుకునేవాడని బాధపడ్డాడు. ఈ క్రమంలో రామ్ ప్రసాద్‌తో తన మనసులోని మాటలను పంచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us