Ram Gopal Varma: వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె’ సాంగ్ మార్ఫింగ్ పై ఆర్జీవీ సంచలన ట్వీట్
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర 'చుట్టమల్లే' సాంగ్ మార్ఫింగ్ వీడియో టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ తదితర సెలబ్రిటీలు ఈ మార్ఫింగ్ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వస్తున్న డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోల వ్యవహారం మరింత తీవ్రమైంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘చుట్టమల్లె’కు సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియో ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ నీచమైన పని చేసిన వారికి హీరో ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తారక్ పెట్టిన పోస్ట్‌కు మద్దతుగా చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ‘చుట్టమల్లె’కు నీచంగా ఎడిట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే గాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ తదితర సెలబ్రిటీలు ఈ మార్ఫింగ్ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంపై ఒక సంచలన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘చుట్టమల్లె’ వీడియోపై సెలబ్రిటీలు స్పందించిన తీరుపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
‘చుట్టమల్లే’ సాంగ్ మార్ఫింగ్ వీడియో వివాదం పై స్పందించిన సెలబ్రిటీలను రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. ‘సెలబ్రిటీలందరూ కలిసి చివరికి సాధించింది ఏమిటంటే.. ఆ చెడ్డ లింక్‌ను అందరికీ మరింతగా తెలిసేలా చేయడం. దానివల్ల కోట్లాది మంది ఆ వీడియోను చూసే పరిస్థితి వచ్చింది. అసభ్యకర లింక్, కంటెంట్ ను కోట్లాది మంది చూసేలా సెలబ్రిటీలు తమ ట్వీట్లతో పబ్లిసిటీ చేశారు. నిజానికి ఆ తప్పు చేసిన అసలు వ్యక్తిని పట్టుకోవడంపై అందరూ దృష్టి పెట్టాల్సింది పోయి, ఇలా దాని గురించి మాట్లాడటం వల్ల ఆ వీడియో మరింత వైరల్ అయ్యింది. నిందితుడిని పట్టుకునే పని చేసి ఉంటే బాగుండేది.. కానీ ఇలా పెద్ద ఎత్తున ట్వీట్లు చేయడం వల్ల బాధితురాలి పేరు బయటకు రావడానికి అందరూ కారణం అయ్యారు. ఇది కూడా ఒక రకంగా నేరం కిందకే వస్తుంది’ అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ‘చుట్టెమల్లె’ సాంగ్ ప్రస్తావన తేనప్పటికీ ఆయన ఇన్ డైరెక్ట్‌గా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring enormous attention to the victim’s identity and the offensive content which is also a crime
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




