అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉడకని మటన్ పై పోలీస్ ఫిర్యాదు ఘటన చర్చనీయాంశమైంది. హాజీ అనే వ్యక్తి పండక్కి తెచ్చుకున్న మటన్ 20 విజిల్స్ వేసినా ఉడకకపోవడంతో నేరుగా కుక్కర్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు నచ్చజెప్పి మటన్ షాపునకు పంపగా, దుకాణదారుడు మరో కేజీ మటన్ ఉచితంగా ఇచ్చారు. అత్యవసర సేవల దుర్వినియోగంపై పోలీసులు విజ్ఞప్తి చేశారు.