బియ్యం గింజలు లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీటిని ఆహారంగా తీసుకుంటారు కాబట్టి, ఇంటిలో నిలువ ఉంచుకుంటారు.
బియ్యం గింజలు
అయితే ఈ చిన్న బియ్యం గింజలతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు అంటున్నారు పండితులు. అది ఎలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
అదృష్టం
కొంత మంది చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు, ఎంత కష్టపడని పని చేసినా చేతిలో రూపాయి నిలువక పోవడంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఇవి బెస్ట్.
ఆర్థిక సమస్యలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న బియ్యం గింజలను ఉపయోగించి, ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
దోషాలు
ఎవరు అయితే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారు ఏడు బియ్యపు గింజలను పర్సులో పెట్టుకోవడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.
అప్పుల బాధలు
అలాగే ఒక ఎర్రటి కాటన్ క్లాత్ తీసుకొని. అందులో గుప్పెడు బియ్యం వేసి, చిన్న మూటలా కట్టాలి. దీనిని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది.
లక్ష్మీ కటాక్షం
అదే విధంగా ఇంటి ముందు ధాన్యం ఉన్న తోరణం కట్టడం కూడా చాలా మంచిదంట. దీని వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ధాన్యపు తోరణం
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.