ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!

Samatha

22 march 2026

చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలు తింటారు. ఇక సండే వస్తే చాలు ఈ మధ్య కాలంలో చాలా మంది చికెన్  మటన్ కంటే ఫిష్ తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఫిష్

అయితే కొంత మంది చేపలకు ధర పెరగడంతో చేపలు కొనే వద్ద ఎక్కువగా ఆలోచిస్తుంటారు.  తక్కువ ధరలో లభించే చేపలతో ఎక్కువగా ప్రయోజనాలు ఉండవు అనుకుంటారు.

ధర

కానీ తక్కువ ధరకే లభించే కొన్ని చేపలు పోషకాల్లో సూపర్ స్టార్స్ అని చెబుతున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సూపర్ స్టార్ ఫిష్

సార్డినెస్ చేపలు వీటిని మత్తి లేదా కవ్వళ్ళు చేపలు అనికూడా అంటారు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కానీ ఇందులో బీ 12 , కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

సార్డినెస్

అలాగే, వీటిని క్రమం తప్పకుండా తినడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుందని, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు నిపుణులు.

ఆరోగ్యం

ఆంకోవీస్ చేపలు ఇవి చాలా చవకైనవి, తెలంగాణ, ఏపీలో చాలా మంది వీటిని వండుకుంటారు. ఈ చేపల్లో బాలింతల్లో పాలు పెరగడానికి ఎక్కువగా పెడుతుంటారు. ఆరోగ్యానికి చాలా మంచివి.

ఆంకోవిన్ లు

కొర్రమీనులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.  ఇవి మెరిసే రంగులో ఉంటాయి. వీటిని తినడం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలకు చాలా మంచిది.

కొర్ర మీనులు

కొడువా చేపలు పండుగప్ప, సీ బాస్ అని పిలుస్తారు. ఇవి చాలా రుచికరమైన చేపలు. చాలా తక్కువ ధరకు లభించే ఈ చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.

కొండువా చేపలు