ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?
Samatha
22 march 2026
ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఐస్ క్రీమ్
అయితే ఈ సమ్మర్‌లో వేడి నుంచి బయటపడటానికి మీరు కూడా చల్ల చల్లని ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటున్నారా? అయితే ఎక్కడో బయట కొనుగోలు చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
సమ్మర్
ముఖ్యంగా రెగ్యులర్‌గా తినేది కాకుండా, ఆరోగ్యాన్నిచ్చే టేస్టీ టేస్టీ కొబ్బరి ఐస్ క్రీమ్ ఇంట్లో చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం.
కొబ్బరి ఐస్ క్రీమ్
కొబ్బరి ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : కొబ్బరి తురుము కప్పు, తెల్లని భాగం మాత్రమే, కొబ్బరి నీరు రెండు కప్పులు, కొబ్బరి పాలు కప్పు, క్రీమ్ ఒక కప్పు, పాలు కప్పు, వెనిలా ఎసెన్స్ వన్ టీ స్పూన్,.
కావాల్సని పదార్థాలు
ఐస్ క్రీమ్ తయారీ కోసం, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కొబ్బరి పొడి, కొబ్బరి నీళ్లు వేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
కొబ్బరి నీళ్లు
ఇప్పుడు ఈ పేస్ట్‌కు కొబ్బరి పాలు కలపాలి. తర్వాత వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసి, మళ్లీ రెండు నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ పట్టడం
తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో చల్లని క్రీమ్, తీసుకొని దానిని మంచిగా కలిపి, అందులో కొబ్బరి మిశ్రమం వేయాలి. తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలి.
కొబ్బరి మిశ్రమం
ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా కలపాలి. తరవాత దీనిని ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి, దానిని డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ చల్ల చల్లని కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ