తమిళనాడు అధికారుల నిర్వాకం.. గొయ్యి తవ్వి.. ఏపీ ప్రజలు రాకుండా చూస్తారట !
తమిళనాడు అధికారుల నిర్వాకం ఒకటి మళ్ళీ బయటపడింది. ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలోకి ప్రవేశించకూడదంటూ.. వారు ఏపీకి, తమ రాష్ట్రానికి మధ్య సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డుగా భారీ గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద వాళ్ళు గొయ్యి తవ్వారు. ఇలా చేసినందువల్ల రెండు రాష్టాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచిపోతాయట. ఆ రాష్ట్రంలోని ఊత్తుకోటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ సోకడంతో బహుశా ఇందుకు ఏపీ వారే కారణమై ఉండవచ్ఛునని వారు భావిస్తున్నట్టు కనబడుతోంది. […]

తమిళనాడు అధికారుల నిర్వాకం ఒకటి మళ్ళీ బయటపడింది. ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలోకి ప్రవేశించకూడదంటూ.. వారు ఏపీకి, తమ రాష్ట్రానికి మధ్య సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డుగా భారీ గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద వాళ్ళు గొయ్యి తవ్వారు. ఇలా చేసినందువల్ల రెండు రాష్టాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచిపోతాయట. ఆ రాష్ట్రంలోని ఊత్తుకోటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ సోకడంతో బహుశా ఇందుకు ఏపీ వారే కారణమై ఉండవచ్ఛునని వారు భావిస్తున్నట్టు కనబడుతోంది. తమిళనాడులో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే.