AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: బ్యాంక్ అకౌంట్ వాడకపోతే మీ సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా.. ఈ విస్తుపోయే నిజాలు పక్కా తెలుసుకోండి..

మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? వాటిలో కొన్నింటిని అస్సలు వాడకుండా అలాగే వదిలేశారా? అయితే జాగ్రత్త.. మీరు వాడటం లేదని నిర్లక్ష్యం చేస్తున్న ఆ పాత బ్యాంక్ అకౌంట్, మీ సిబిల్ స్కోర్‌ను పాతాళానికి తొక్కేసే ప్రమాదం ఉంది. అసలు బ్యాంక్ అకౌంట్‌కు, క్రెడిట్ స్కోర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలుసుకుందాం..

Credit Score: బ్యాంక్ అకౌంట్ వాడకపోతే మీ సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా.. ఈ విస్తుపోయే నిజాలు పక్కా తెలుసుకోండి..
Impact Of Unused Bank Accounts On Cibil Score
Krishna S
|

Updated on: Mar 23, 2026 | 6:07 PM

Share

ప్రస్తుతం ఉన్న రోజుల్లో లోన్ కావాలన్నా, క్రెడిట్ కార్డ్ కావాలన్నా అందరూ చూసే మొదటి విషయం సిబిల్ స్కోర్. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు ఈజీగా లోన్స్ ఇస్తాయి. అయితే చాలా మంది తమ క్రెడిట్ హిస్టరీ, ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. వాడకుండా వదిలేసిన పాత బ్యాంక్ అకౌంట్ల వల్ల తెలియకుండానే ఇబ్బందుల్లో పడుతున్నారు. అసలు పాత అకౌంట్లకు, సిబిల్ స్కోర్‌కు ఉన్న సంబంధం ఏంటనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

పాత అకౌంట్ల వల్ల నేరుగా ప్రభావం ఉంటుందా?

సాధారణంగా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లు అనేవి క్రెడిట్ ప్రోడక్ట్స్ కావు. కాబట్టి వీటిని వాడకపోవడం వల్ల సిబిల్ స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉండదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి మీ క్రెడిట్ రేటింగ్‌ను పరోక్షంగా దెబ్బతీస్తాయి.

సిబిల్ స్కోర్ ఎప్పుడు తగ్గుతుంది?

నెగిటివ్ బ్యాలెన్స్ – పెనాల్టీలు: వాడకుండా వదిలేసిన అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. దీనివల్ల అకౌంట్ బ్యాలెన్స్ నెగిటివ్ అవుతుంది. ఈ బకాయిలను మీరు చెల్లించకపోతే బ్యాంకులు వాటిని డిఫాల్ట్‌గా పరిగణించి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది.

లింక్డ్ ఈఎంఐలు: మీ పాత అకౌంట్‌కు ఏదైనా ఈఎంఐ లేదా బిల్ పేమెంట్స్ లింక్ అయి ఉండి అందులో తగినంత నగదు లేకపోతే పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఇది నేరుగా మీ సిబిల్ స్కోర్‌ను పాతాళానికి పడిపోయేలా చేస్తుంది.

అనధికారిక లావాదేవీలు: వాడని అకౌంట్లపై నిఘా ఉండదు కాబట్టి సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఏదైనా అనధికారిక లావాదేవీలు జరిగితే అది మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై మచ్చలా మారుతుంది.

సిబిల్ అంటే ఏమిటీ..?

సిబిల్ అంటే క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్. ఇది భారతదేశంలోని నాలుగు ప్రధాన క్రెడిట్ బ్యూరోలలో ఒకటి. మిగిలిన మూడు ఈక్విఫ్యాక్స్, CRIF హైమార్క్, ఎక్స్‌పీరియన్. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థలే.

ఏం చేయాలి..?

మీకు అవసరం లేని పాత బ్యాంక్ అకౌంట్లను వెంటనే క్లోజ్ చేయడం ఉత్తమం. దీనివల్ల అదనపు ఛార్జీలు, పెనాల్టీల భారం తప్పుతుంది. ఒకవేళ అకౌంట్ ఉంచాలనుకుంటే తప్పనిసరిగా కనీస నిల్వను మెయింటైన్ చేయాలి. అప్పుడప్పుడు అకౌంట్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేస్తూ ఉండాలి. ఆర్థిక భవిష్యత్తు బాగుండాలంటే కేవలం అప్పులు తీర్చడమే కాదు, పాత బ్యాంక్ ఖాతాల నిర్వహణలోనూ మెలకువగా ఉండటం అవసరం.

Follow Us