AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings Tips: అధిక ఈఎంఐలతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారా..? ఈ మూడు పనులు చేస్తే మీ సమస్యలు ఖచ్చితంగా తీరినట్లే..

ఇప్పటి ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ లోన్లను తీసుకుంటున్నారు. తిరిగి వాటిని చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈఎంఐల భారం తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీరు ఈఎంఐల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Savings Tips: అధిక ఈఎంఐలతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారా..? ఈ మూడు పనులు చేస్తే మీ సమస్యలు ఖచ్చితంగా తీరినట్లే..
money
Venkatrao Lella
|

Updated on: Mar 23, 2026 | 3:59 PM

Share

ఇప్పటి పరిస్థితుల్లో రుణాలు అనేవి సులభతంగా లభిస్తున్నాయి. బ్యాంకులే కాకుండా ఎన్‌ఎఫ్‌బీసీ, ఇతర ఆర్ధిక సంస్థలు నిమిషాల్లోనే లోన్లను మంజూరు చేస్తున్నాయి. కాల్ చేసి మరీ రుణం తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుల్లో డిస్కౌంట్ వంటి అనేక రకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఆర్ధిక స్థితిగతుల క్రమంలో చాలామంది రుణాలను తీసుకుని ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ లోన్లను తీసుకుని ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు పాటించాల్సిన ట్రిక్స్ ఏంటో ఇందులో చూద్దాం.

ఒకటి కంటే ఎక్కువ ఈఎంఐలు ఉన్నాయా..?

హోమ్ లోన్, ఆస్తిపై తీసుకునే లోన్లకు తక్కువ వడ్డీ ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లకు ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఏ లోన్‌పై ఎంత వడ్డీ పడుతుందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అనంతరం మీరు ఎక్కువ వడ్డీ ఉన్న ఈఎంఐలను త్వరగా తీర్చడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీపై పడే ఆర్ధిక భారం కాస్త తగ్గుతుంది. ఇక అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం, పొదుపు చేసిన డబ్బులను రుణం చెల్లించడానికి ఉపయోగించడం వల్ల త్వరగా ఈఎంఐల నుంచి బయటపడతారు.

కొత్త అప్పు చేయవద్దు

ఈఎంఐలు ఎక్కువగా ఉన్న సమయంలో కొత్త అప్పుల జోలికి అసలు వెళ్లకండి. దీని వల్ల మీరు మరింత అప్పుల ఉబిలో చిక్కుకుంటారు. ఒక ఒకటి కంటే ఎక్కువ రుణాలను తీసుకోకండి. ఒక ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లయితే.. వాటిని వదిలించుకోండి. క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ రేట్లతో పాటు లేట్ ఫీజులు, రివాల్వింగ్ ఛార్జీలు అధికంగా ఉంటాయి. దీని వల్ల మీరు త్వరగా అదుపు తప్పుతారు. ఈఎంఐలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చులు వీలైనంతగా తగ్గించుకోండి. షాపింగ్ చేయడం, బయట తినడం లాంటివి తగ్గించుకోండి. ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీ ఖర్చులపై మీ నియంత్రణ కోల్పోకుండా ఉండండి. ఇక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నెలల పాటు గృహ అవసరాలకు సరిపోయేంత సొమ్ము ఉంచుకోవాలి. క్రెడిట్ కార్డులను అనవసరంగా వాడటం తగ్గించడం, ఖర్చులపై నియంత్రణ, అధిక వడ్డీ ఉన్న ఈఎంఐలను ముందుగా చెల్లించడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు ఈఎంఐల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీకు అధిక ఈఎంఐలు ఉండి బాధపడుతుంటే ఈ చిన్న ట్రిక్స్ పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..