AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Hacks: కుళ్లిన టమోటాలను పారేస్తున్నారా?.. వీటితో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?

వంటగదిలో టమోటాలు మెత్తబడినా లేదా కుళ్ళిపోయినా వెంటనే వాటిని చెత్తబుట్టలో పారేయడం మనందరికీ అలవాటు. కానీ, అలా చేయడం ద్వారా మీరు ఒక గొప్ప సహజ వనరును వృధా చేస్తున్నారని మీకు తెలుసా? పండు కుళ్ళిపోయినా దాని లోపల ఉండే విత్తనాలు ఆమ్లాలు ఇప్పటికీ శక్తివంతంగానే ఉంటాయి. ఈ వ్యర్థ టమోటాలను మీ తోటలో ఇంటిని శుభ్రం చేయడంలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

Tomato Hacks: కుళ్లిన టమోటాలను పారేస్తున్నారా?.. వీటితో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?
How To Reuse Rotten Tomatoes
Bhavani
|

Updated on: Mar 23, 2026 | 5:37 PM

Share

టమోటాలో ఉండే సిట్రిక్ మాలిక్ ఆమ్లాలు లోహపు పాత్రలను మెరిపించడంలో మేటిగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు మొక్కలకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగపడతాయి. ఆహార వ్యర్థాలను తగ్గించుకుంటూనే, మన ఇంటిని పచ్చదనంతో ఎలా నింపుకోవచ్చు? కుళ్ళిన టమోటాల నుండి విత్తనాలను ఎలా మొలకెత్తించాలి? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లోనే సేంద్రీయ తోట

కుళ్ళిన టమోటా లోపల విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. వీటిని చిన్న ముక్కలుగా కోసి కుండీలోని మట్టిలో పాతిపెట్టండి. కేవలం 10-15 రోజుల్లోనే ఆరోగ్యకరమైన టమాటా మొలకలు వస్తాయి. బయట విత్తనాలు కొనే పనిలేకుండా మీరే స్వయంగా తాజా కూరగాయలను పండించుకోవచ్చు.

మొక్కలకు సహజ ఎరువు

టమోటాల్లో నత్రజని, పొటాషియం భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కుళ్ళిన టమోటాలను నేరుగా కంపోస్ట్ డబ్బాలో వేయడం వల్ల అవి విచ్ఛిన్నమై పోషకాలు అధికంగా ఉండే ఎరువుగా మారుతాయి. ఇది నేల నాణ్యతను పెంచి మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

లోహపు పాత్రల క్లీనింగ్

టమోటా గుజ్జులోని సహజ ఆమ్లాలు రాగి ఇత్తడి పాత్రలపై పేరుకుపోయిన మొండి మరకలను తొలగిస్తాయి.

ఎలా చేయాలి? టమోటా ముక్కను నేరుగా పాత్రపై రుద్ది, కాసేపు అలాగే ఉంచండి. ఆపై నీటితో కడిగితే పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.

ముఖ్యమైన సూచనలు:

కుళ్ళిన టమోటాలను ఉపయోగిస్తున్నప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది.

విత్తనాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు అవి మరీ లోతుగా కాకుండా పైన తేలికగా మట్టితో కప్పండి.

చిన్న చిట్కా: కుళ్ళిన టమోటాలను తోట మట్టిలో కలిపేటప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేసి కలిపితే, అవి త్వరగా భూమిలో విచ్ఛిన్నమై మొక్కలకు పోషకాలు అందుతాయి.

Follow Us
స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు..
స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు..
చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు..
చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు..
50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకురూ.94 లక్షలు
50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకురూ.94 లక్షలు
కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు కొట్టిన ప్లేయర్లు
కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు కొట్టిన ప్లేయర్లు
కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే
కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే
ద్రాక్ష ప్రియులు తెలుసుకోవాల్సిన ఆసక్తికర నిజాలు ఇవే!
ద్రాక్ష ప్రియులు తెలుసుకోవాల్సిన ఆసక్తికర నిజాలు ఇవే!
కుళ్లిన టమాటోలను పారేస్తున్నారా?.. ఈ ట్రిక్స్ తెలిస్తే వదలరు
కుళ్లిన టమాటోలను పారేస్తున్నారా?.. ఈ ట్రిక్స్ తెలిస్తే వదలరు
అరటి తొక్కపై కాలు వేస్తే ఎందుకు జారిపడతాం.. దాన్ని వెనకున్న..
అరటి తొక్కపై కాలు వేస్తే ఎందుకు జారిపడతాం.. దాన్ని వెనకున్న..
ఇంట్లో వాము మొక్క పెట్టడం శుభమా అశుభమా? చాలామందికి తెలియని విషయం!
ఇంట్లో వాము మొక్క పెట్టడం శుభమా అశుభమా? చాలామందికి తెలియని విషయం!
ఒక్కరోజే భారీగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే క్రాష్
ఒక్కరోజే భారీగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే క్రాష్