ఆరోగ్యానిక అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో ఐరన్ చాలా కీలకం. ఇది హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్‌ను శరీరమంతా చేరవేయడానికి సహాయపడుతుంది
TV9 Telugu
శరీరంలో ఐరన్ సరిపడినంత ఉండటం వల్ల శక్తి స్థాయిలు, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటాయి. ఐరన్ లోపం వల్ల అనీమియా అనే సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల అలసట, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
అలాగే శరీరంలోని పలు ముఖ్యమైన ప్రక్రియలకు కూడా ఐరన్ అవసరం. ఒంట్లో ఐరన్ స్థాయిని పెంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం
TV9 Telugu
ఆహారాల్లో హీమ్ ఐరన్ (జంతు ఆహారాల్లో), నాన్-హీమ్ ఐరన్ (మొక్కల ఆహారాల్లో) అనే రెండు రకాల ఐరన్ లభిస్తాయి. ఈ రెండింటినీ సమతుల్యంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది
TV9 Telugu
ముఖ్యంగా మునగలో ప్లాంట్-బేస్డ్ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉండటంతో ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. అందువల్ల ఇది ప్రత్యేకంగా ఉపయోగకరమైన ఆహారమని చెప్పవచ్చు
TV9 Telugu
ఇవే కాకుండా మునగ ఆకులు, గింజలు, విత్తనాలు, ఇతర ధాన్యాలు, చేపలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఐరన్ మంచి వనరులుగా పరిగణించబడతాయి. ఈ ఆహారాలను తీసుకోవడంతోపాటు ఐరన్ శోషణను మెరుగుపరచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
TV9 Telugu
హీమ్, నాన్-హీమ్ ఐరన్ రెండింటినీ కలిపి తీసుకోవడం మంచిది. అలాగే విటమిన్ సి ఉన్న ఆహారాలను ఐరన్ ఉన్న భోజనంతో తీసుకుంటే శరీరం ఐరన్‌ను సులభంగా గ్రహిస్తుంది
TV9 Telugu
అదేవిధంగా టీ, కాఫీ, కాల్షియం వంటి పదార్థాలను ఐరన్ ఉన్న భోజనంతో కలిసి తీసుకోవడం నివారించాలి, ఎందుకంటే ఇవి ఐరన్ శోషణను తగ్గిస్తాయి. వేసవిలో ఈవిధంగా సరైన ఆహారం, మంచి అలవాట్ల ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిని సులభంగా పెంచుకోవచ్చు