నోరూరించే పచ్చి మిర్చి.. ముచ్చటపడి కాస్తింత కొరికే కారం నషాలానికి అంటుతుంది. అయినా సరే పచ్చి మిర్చి లేకుండా ఏ వంట పూర్తి కాదు. కూరలో కారం ఎంత వాడినా సరే పచ్చి మిర్చి వేస్తే ఆ టేస్టే వేరు
TV9 Telugu
నోటికి కాస్తంత కారం తగలాలన్నా, టేస్ట్ బడ్స్ ఒక్కసారిగా యాక్టివ్ అవ్వాలన్నా పచ్చి మిర్చి ఉండాల్సిందే. చప్పగా ఉండే పెరుగు రుచిని కూడా కారంగా ఉండే పచ్చిమిర్చి బ్యాలెన్స్ చేస్తుంది
TV9 Telugu
అందుకే ఇప్పటికీ కొంత మంది పప్పు అన్నం తినేటప్పుడు పక్కన పచ్చిమిర్చి పెట్టుకుంటారు. విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి
TV9 Telugu
విటమిన్ సి ఎక్కువగా ఉందంటే అది బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆ రకంగా చూస్తే పచ్చిమిర్చి మన శరీరానికి చాలా అవసరం. పచ్చిమిర్చిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అయితే ఇందులో ఉండే క్యాప్సిన్ తోనూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గాలని చూసే వారికి మందులా పని చేస్తుంది
TV9 Telugu
కారణం ఇందులో ఉండే క్యాప్సిన్. ఇది జీర్ణ వ్యవస్థను సరైన విధంగా ఉంచుతుంది. ఆహారం సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో పాటు అనారోగ్యకరమైన ఆకలిని పోగొడుతుంది. తద్వారా అతిగా తినడం తగ్గుతుంది
TV9 Telugu
మితిమీరి తినడం తగ్గితే క్రమంలో బరువు తగ్గుతారు. ఇలా బరువు తగ్గడానికి పచ్చిమిర్చి మెడిసిన్‌లా పని చేస్తుంది. పైగా ఇందులో కేలరీలు చాలా తక్కువ. అందుకే బరువు సులువుగా తగ్గొచ్చు
TV9 Telugu
పచ్చిమిర్చిలో విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు చర్మ ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడి త్వరగా ముసలితనం రాకుండా నివారిస్తాయి. చర్మంపై ముడతలు, యాక్నీ లాంటి సమస్యలూ కూడా తొలిగిపోతాయి