పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రూ.12 లక్షల సైబర్ మోసానికి గురయ్యారు. ఆర్టిఎ చలాన్ లింకును క్లిక్ చేయడంతో ఆయన ఖాతా నుంచి సొమ్ము మాయమైంది. జీలుగుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నందున అనుమానాస్పద లింకులను తెరవవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.