చిత్తూరు జిల్లా పీలేరులో ఆర్టీసీ కండక్టర్ ప్రకాష్‌పై అమానుషంగా దాడి జరిగింది. తిరుపతిలో బస్సు రద్దీగా ఉండటంతో మరో బస్సులో రావాలని కండక్టర్ సూచించారు. దీంతో వివాదం మొదలైంది. జీరో టికెట్ కోసం ఓ మహిళ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. పీలేరు బస్టాండ్‌కు చేరుకోగానే ఆమె భర్త, స్నేహితులు కండక్టర్‌పై దాడి చేశారు. బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.