ప్రజాప్రతినిధుల్లో ‘కరోనా’ టెన్షన్.. హోమ్ క్వారంటైన్‌లో పలువురు
ప్రపంచవ్యాప్తంగా కరోనా టెన్షన్ కొనసాగుతోంది. చిన్న-పెద్ద, బీద-ధనిక, కుల-మత తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా టెన్షన్ కొనసాగుతోంది. చిన్న-పెద్ద, బీద-ధనిక, కుల-మత తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మరోవైపు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధుల్లోనూ కరోనా టెన్షన్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిన పడగా.. వారిలో కొంతమంది కోలుకోగా, మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ.. ప్రజాప్రతినిధుల్లో కరోనా ఆందోళన కొనసాగుతోంది. తమ దగ్గర పనిచేసే సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పటికే పలువురు అధికారులు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
కరోనా ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనబడుతున్నాయి. ఇక మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం మంది సిబ్బందిని తగ్గించుకున్న ప్రజాప్రతినిధులు.. తమ వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా భయంతో పీఏ, గన్ మెన్ రద్దు చేసి తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తున్నారు ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్. ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఆయన సతీమణి, గన్ మెన్ డ్రైవర్, వంట మనిషికి కరోనా పాజిటివ్ తేలడంతో వారందరూ చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నగర మేయర్ డ్రైవర్‌కి కరోనా సోకడంతో బొంతు రామ్మోహన్ కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక పీఏకు పాజిటివ్ రావడంతో మంత్రి హరీష్ రావు సైతం ఇంట్లో ఉన్నారు.
Read This Story Also: చెన్నై ప్రభుత్వాసుపత్రిని కుదిపేస్తున్న కరోనా.. ఏకంగా



