AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌష్టికాహారంపై జనం ఫోకస్ !

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే..రోగ నిరోధక శక్తి పెరగాలి. అదే ఇమ్యూనిటీ పవర్. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం తినాలి..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఎవరి నోట విన్నా ఇదే మాట. దీంతో జనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెడుతున్నారు.

పౌష్టికాహారంపై జనం ఫోకస్ !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 12:32 PM

Share

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే..రోగ నిరోధక శక్తి పెరగాలి. అదే ఇమ్యూనిటీ పవర్. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం తినాలి..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పంజా విసురుతున్న కరనోనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్యులు. దీంతో జనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెడుతున్నారు. రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మాయదారి మహమ్మారి కరోనా రోగ నిరోధక శక్తి లేని బాధితుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. కరోనాను నయం చేసేందుకు ఇప్పటి వరకూ మందులేదు. కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్ లు, శానిటైజర్లు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం తప్పా..మరో మార్గం లేదు. ఇవ్వన్నీ పాటిస్తున్నా రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం ఏవేవి తీసుకోవాలనేదానిపై ఇప్పుడు అందరిలోనూ శ్రద్ధ పెరిగింది. దీంతో న్యూట్రిషియన్లు, వైద్యులు, మెడికల్ స్టోర్స్ దగ్గర జనం ఎంక్వైరీలు మొదలు పెట్టారు. కరోనా అంటకుండా జాగ్రత్తలు పడుతూనే, అది సోకినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఇమ్యూనిటీ పెంచుకునే పనిలోపడ్డారు. దీని కోసం ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతిపైనా ఆధారపడుతున్నారు. ఇప్పుడు నెలవారీ సరుకుల లిస్టులో ‘ఇమ్యూనిటీ బూస్టర్లు’ కూడా చేరిపోయాయి.

Follow Us
విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే
విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?