AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onam: ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు? అసలు కథ ఇదే!

Onam festival 2026: మహారాజు మహాబలి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని పురాణ కథనం. వామన అవతారంలో విష్ణువు మహాబలిని మూడు అడుగుల భూమిని కోరడం, చివరికి రాజు తన తలనే మూడో అడుగుకు సమర్పించడం వెనుక ఆసక్తికరమైన కథ ఏమిటి? మహాబలి ప్రతి సంవత్సరం తన ప్రజలను కలుసుకునే సందర్భాన్నే ఓనం పండుగగా ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.

Onam: ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు? అసలు కథ ఇదే!
Onam Festival Story
Rajashekher G
|

Updated on: Aug 15, 2026 | 2:47 PM

Share

Onam Festival Story Telugu: కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఓనం ఒకటి. పంటల పండుగగా మాత్రమే కాకుండా, ప్రజలపై అపారమైన ప్రేమను చూపిన మహారాజు మహాబలిని స్మరించుకునే పర్వదినంగా కూడా ఓనంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పురాణ కథనం ప్రకారం.. మహాబలి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో, సమానత్వంతో జీవించేవారని నమ్మకం. పూర్వకాలంలో మహాబలి అనే అసుర రాజు కేరళ ప్రాంతాన్ని పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన దానగుణం, ధర్మబద్ధమైన పాలనకు ప్రసిద్ధి. మహాబలి రాజ్యంలో పేదరికం, ఆకలి, అబద్ధాలు, అసూయ, అన్యాయం లేకుండా ప్రజలు సంతోషంగా జీవించేవారని కథనం. దీంతో మహాబలి కీర్తి మూడు లోకాలకూ వ్యాపించింది. మహాబలి ప్రభావం, కీర్తి పెరుగుతుండటంతో దేవతలు ఆందోళన చెందారని పురాణ కథనం. దీంతో వారు మహావిష్ణువును ఆశ్రయించారు. మహాబలి దానగుణాన్ని పరీక్షించడంతో పాటు, దేవతల ఆందోళనను తొలగించేందుకు విష్ణుమూర్తి వామన అవతారం ధరించారు.

వామన అవతారం.. మూడు అడుగుల భూమి

మహాబలి నిర్వహిస్తున్న యజ్ఞానికి వామనుడు చిన్న బ్రాహ్మణుడి రూపంలో వెళ్లాడు. అక్కడ మహాబలిని మూడు అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరాడు. తనను అడిగినది చాలా చిన్న కోరికే కావడంతో మహాబలి వెంటనే అంగీకరించాడు. అయితే ఆ వెంటనే వామనుడు విశ్వరూపాన్ని ధరించాడు. మొదటి అడుగుతో ఆకాశాన్ని, రెండో అడుగుతో భూమిని కొలిచాడు. ఇక మూడో అడుగు వేయడానికి స్థలం మిగలలేదు. ఇచ్చిన మాటను తప్పకూడదని భావించిన మహాబలి.. తన తలనే మూడో అడుగుకు సమర్పించాడు.

మహాబలి త్యాగం.. విష్ణువు ఇచ్చిన వరం

మహాబలి (బలి చక్రవర్తి) తన తలను సమర్పించడంతో వామనుడు మూడో అడుగు అతని తలపై ఉంచి, అతడిని పాతాళ లోకానికి పంపినట్లు పురాణ కథనం. అయితే మహాబలి నిజాయితీ, దానగుణం, త్యాగానికి మెచ్చిన విష్ణుమూర్తి అతనికి ఒక వరం ప్రసాదించాడు. తన ప్రజలను ఎంతో ప్రేమించిన మహాబలి.. సంవత్సరానికి ఒక్కసారైనా భూలోకానికి వచ్చి తన ప్రజలను కలుసుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లు కథనం. విష్ణువు ఆ కోరికను అంగీకరించడంతో, మహాబలి ప్రతి సంవత్సరం తన ప్రజలను సందర్శించడానికి వస్తాడని నమ్మకం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మహాబలికి స్వాగతంగా ఓనం

మహాబలి తన ప్రజలను సందర్శించే ఆ పవిత్ర సందర్భాన్నే కేరళ ప్రజలు ఓనం పండుగగా ఘనంగా జరుపుకుంటారని విశ్వాసం. తమ ప్రియమైన రాజుకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఇళ్ల ముందు అందమైన పూలతో ‘అత్తపూకలం’ ఏర్పాటు చేస్తారు. సంప్రదాయ వంటకాలతో ‘ఓనసద్య’ను సిద్ధం చేసి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అందుకే ఓనం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. మహాబలి రాజు పాలనలోని సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజల పట్ల ప్రేమను గుర్తుచేసే పర్వదినంగా కేరళ సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది ఓనం పండగను కేరళ ప్రజలు ఆగస్టు 16 నుంచి వేడుకగా జరుపుకుంటారు.

(Disclaimer: ఈ కథనం పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయ కథనాల ఆధారంగా రూపొందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు
ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..
ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..
సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేస్తున్నారా? ఈ పొరపాటు చేస్తే..
సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేస్తున్నారా? ఈ పొరపాటు చేస్తే..
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..