AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!

మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే, చిన్న మొటిమ కనిపించిన వెంటనే చాలామంది దాన్ని త్వరగా నయం చేయడానికి రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తారు. కొందరు ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే, మరికొందరు రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. అలాంటి ఒక చిట్కా విక్స్ రాయడం. విక్స్ రాయడం వల్ల మొటిమలు రాత్రికి రాత్రే నయమవుతాయని నమ్ముతారు. సోషల్ మీడియాలో చాలామంది బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్లు, సాధారణ ప్రజలు ఈ చిట్కాను ప్రయత్నించడం మీరు చూసే ఉంటారు. కానీ, అలా చేయడం సరైనదేనా? మొటిమలకు విక్స్ రాయడం అనే ఈ చిట్కా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో చర్మ సంరక్షణ నిపుణుల నుండి తెలుసుకుందాం.

విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!
Acne Treatment
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2026 | 3:35 PM

Share

చర్మంపై చిన్న మొటిమ రాగానే దాన్ని త్వరగా పోగొట్టుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చూసి లేదా ఇంట్లోని పెద్దల మాటలు విని విక్స్ వేపోరబ్ మొటిమపై రాసి రాత్రంతా ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. విక్స్ రాస్తే రాత్రికి రాత్రే మొటిమలు మాయమవుతాయని నమ్ముతుంటారు. కానీ, ఇది చర్మానికి ఎంతవరకు సురక్షితం? ప్రముఖ చర్మవైద్య నిపుణురాలు (Dermatologist) డాక్టర్ ప్రియాంక రెడ్డి దీనిపై కీలక సూచనలు చేశారు.

ఈ మేరకు ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు ప్రియాంక రెడ్డి ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో , ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి విక్స్ ఉపయోగపడుతుందని, అంతేగానీ మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడానికి లేదా మొటిమలకు చికిత్స చేయడానికి కాదని ఆ చర్మ వైద్యురాలు వివరిస్తున్నారు. విక్స్‌లో కర్పూరం, మెంథాల్, యూకలిప్టస్ నూనె వంటి పదార్థాలతో పాటు, చాలా చిక్కగా ఉండే పెట్రోలియం బేస్ కూడా ఉంటుంది. దీనిని ముఖానికి పూయడం వల్ల చర్మంపై ఒక మందపాటి పొర ఏర్పడి, మీ చర్మ రంధ్రాలు మరింతగా మూసుకుపోతాయి.

చల్లగా అనిపించడం మొటిమ నయమైనట్లు సూచన కాదు:

ఇంకా ఇలా కూడా వివరిస్తున్నారు, విక్స్ రాసుకున్న తర్వాత, మీ ముఖంపై చల్లగా లేదా తేలికపాటి జలదరింపుగా అనిపించవచ్చు. అందుకే కొంతమంది ఆ మందు మొటిమపై పనిచేసి, దాన్ని నయం చేస్తోందని అనుకుంటారు. కానీ, వాస్తవానికి, అది నిజం కాదు. ఈ చల్లని అనుభూతి మొటిమ నయం కావడం వల్ల కాదు, ముఖ చర్మంపై మంట లేదా చికాకు కలగడం వల్ల వస్తుంది. అందువల్ల, విక్స్‌ను ముఖానికి అస్సలు రాసుకోకూడదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట విక్స్ రాస్తే ఏం జరగవచ్చు?:

చాలా మంది మొటిమలపై విక్స్‌ను రాత్రంతా అలాగే వదిలేస్తారు. డాక్టర్ ప్రియాంక ప్రకారం, మొటిమపై విక్స్ రాసి రాత్రంతా అలాగే వదిలేయడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల చర్మం తీవ్రంగా మండిపోవడం, ఎర్రబడటం జరుగుతుంది. అదనంగా, ఆ ప్రదేశంలో నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వైద్య పరిభాషలో దీనిని పోస్ట్-ఇన్‌ఫ్లమేటరీ హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు. మొటిమ అనేది కొద్ది రోజుల్లో సహజంగానే తగ్గిపోవచ్చు, కానీ, విక్స్ వంటివి వాడటం వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు తగ్గడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పడుతుంది.

Follow Us