AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: క్రికెట్ లవర్స్‎కు బిగ్ షాక్.. భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?

IND vs SL: పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత భారత్, శ్రీలంక జట్ల మధ్య లాంగ్ ఫార్మాట్ పోరు ప్రారంభం అయింది. గాళ్ లోని చారిత్రాత్మక మైదానంలో తొలి టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనా వర్షం రూపంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

IND vs SL: క్రికెట్ లవర్స్‎కు బిగ్ షాక్.. భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
Ind Vs Sl
Rakesh
|

Updated on: Aug 15, 2026 | 3:08 PM

Share

IND vs SL: టీమిండియా చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు సమరానికి సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాళ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. అయితే అభిమానులకు ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే దీనికి కారణం.

గాల్లో వర్షం ముప్పు.. టాస్ ఆలస్యం?

గాళ్ స్టేడియంలో జరగనున్న ఈ తొలి టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇండియన్ ఓషన్ తీరంలో ఉన్న ఈ మైదానంలో వాతావరణం దారుణంగా మారింది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు గాళ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

తుది జట్టు ప్రాక్టీస్‌కు వరుణుడి ఆటంకం

మొదటి రోజు ఉదయం 10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ రోజంతా మబ్బులు కమ్మే ఉండే అవకాశం ఉంది. మధ్యమధ్యలో పడే తేలికపాటి చినుకులు మ్యాచ్‌ను పదే పదే అడ్డుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు రోజైన నిన్న కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆటగాళ్లు మైదానంలో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయారు.

5 రోజుల్లో 4 రోజులు వర్షానిదే హవా

ఈ తొలి టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాల్సి ఉండగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అందులో నాలుగు రోజులు వర్షం పడే అవకాశం ఉంది. కేవలం ఒక రోజు మాత్రమే వాతావరణం పొడిగా, ప్రశాంతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల నైపుణ్యంపైనే కాకుండా వరుణుడి కరుణపైనే ఎక్కువగా ఆధారపడి ఉండనుంది. వాతావరణం సహకరిస్తేనే పూర్తి స్థాయిలో ఆట సాధ్యమవుతుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీని చూడాలని ఆశిస్తున్న అభిమానులకు వాతావరణ సూచన ఆందోళన కలిగిస్తోంది. వరుణుడు శాంతిస్తే తప్ప ఈ తొలి టెస్టులో పోటీని వీక్షించడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు