Booster Dose: రెండు డోసుల వ్యాక్సిన్‌ తర్వాత అమెరికాలో బూస్టర్‌ డోస్‌..! ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్న వైద్య నిపుణులు

Booster Dose: ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండో వేవ్‌లో లక్షల మందిని బలిగొన్న ఈ మాయదారి రోగం ఇప్పుడు కాస్త

Booster Dose: రెండు డోసుల వ్యాక్సిన్‌ తర్వాత అమెరికాలో బూస్టర్‌ డోస్‌..! ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్న వైద్య నిపుణులు
Booster Dose
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 18, 2021 | 9:05 AM

Booster Dose: ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండో వేవ్‌లో లక్షల మందిని బలిగొన్న ఈ మాయదారి రోగం ఇప్పుడు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ప్రజలు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రారంభంలో కొందరు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కాస్త అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడిప్పుడే అందులో మార్పులు వస్తున్నాయి. భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వాటిలో రెండు డోసుల్లో తీసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి వృద్ధి చెందే యాంటీబాడీలు కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి ఎక్కువ కాలం రక్షణ పొందేందుకు బూస్టర్‌ డోసును ఇవ్వాలని అమెరికా నిపుణులు భావిస్తున్నారు. వీటిపై అధ్యయనం జరిపిన నిపుణులు.. రెండో డోసు తీసుకున్న 8 నెలల తర్వాత బూస్టర్‌ డోసు అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వంటి రకాలు వస్తుండడంతో బూస్టర్‌ డోసును అనివార్యంగా భావిస్తున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్‌ తీసుకున్న ఏడు, ఎనిమిది నెలల తర్వాత వాటి నుంచి రక్షణ తగ్గుతున్నట్లు ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో నమోదవుతున్న కేసుల విశ్లేషణను బట్టి ఓ అంచనాకు వచ్చారు.

అయితే బూస్టర్‌ డోస్‌ని ఇచ్చే పనిని ఇజ్రాయెల్‌ ఇప్పటికే మొదలుపెట్టింది. తొలివిడతలో 60ఏళ్ల వయసుపైబడిన వారికి.. రెండో డోసు తీసుకున్న ఐదు నెలల తర్వాత బూస్టర్‌ డోసు అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒకవేళ బూస్టర్‌ డోసు పంపిణీ చేపట్టాల్సి వస్తే ముందస్తుగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, నర్సింగ్‌ హోంలలో ఉంటున్న వారితో పాటు వృద్ధులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అమెరికాలో దాదాపు 19.8కోట్ల మంది కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకోగా.. 16కోట్ల మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఫైజర్‌ వంటి సంస్థలు తయారు చేసిన బూస్టర్‌ డోసుల వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA) ఆమోదం తెలపాల్సి ఉందన్నారు.

Viral Photos: ఈ ఫొటోలు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది..! భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలు..

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..