Long Covid: లాంగ్ కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువ..! దుష్ప్రభావాలు ఉంటే వైద్యుల సలహా తప్పనిసరి..
Long Covid: ప్రస్తుతం దేశంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా అక్కడక్కడ మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

Long Covid: ప్రస్తుతం దేశంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా అక్కడక్కడ మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కేసుల నుంచి రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే చాలామందిలో నెగిటివ్ వచ్చినా పోస్ట్ కొవిడ్‌తో బాధపడుతున్నారు. కోవిద్-19 నుంచి కోలుకున్న తర్వాత, నెగిటివ్ వచ్చినా కూడా కొంచెం దగ్గు, బాడీ పెయిన్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, దాన్ని లాంగ్ కోవిద్ అంటారు. వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టడం దీర్ఘకాల లక్షణాలకు (Long Covid Symdrome) దారితీస్తున్నట్లు అనుమానిస్తున్నారు. లాండ్ కొవిడ్‌పై ఐర్లాండ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో పలు కారణాలను విశ్లేషించారు. ఇందులో భాగంగా లాంగ్ కొవిడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 50మంది బాధితుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే లాంగ్ కొవిడ్‌తో బాధపడుతున్న వారి రక్తంలో గడ్డకట్టే కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్ బారినపడిన తర్వాత రక్తం గడ్డకట్టే లక్షణంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉన్నవారిలో లాంగ్ కొవిడ్ సిండ్రోమ్‌తో పాటు శారీరక సామర్థ్యం తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. అయితే పోస్ట్ కొవిడ్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
1. చాలా మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆహారం రుచిని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా వీరికి ఆకలి లేకపోవడం జరుగుతుంది. 2. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. కొన్ని వారాల పాటు ఈ సమస్య ఉంటుంది. దీని నివారణకు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. 3. అలసట, తలనొప్పి.. కరోనా వైరస్ సంక్రమణ సమయంలో తలనొప్పి, అలసట ఉంటుంది. కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చినా కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే ఈ సమాచారం. మరేవైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.