AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: భారతదేశంలో మరోసారి మొదలైన వ్యాప్తి.. గత 24 గంటల్లో 33 వేలకు పైగా కొత్త కరోనా కేసులు

భారత్‌లో ఒమిక్రాన్‌ ఉధృతికి మరోసారి మొదలైంది. అటు కరోనా.. ఇటు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 1,525కు చేరగా..

India Corona: భారతదేశంలో మరోసారి మొదలైన వ్యాప్తి.. గత 24 గంటల్లో 33 వేలకు పైగా కొత్త కరోనా కేసులు
Covid
Sanjay Kasula
|

Updated on: Jan 03, 2022 | 11:25 AM

Share

India Coronavirus Updates: భారత్‌లో ఒమిక్రాన్‌ ఉధృతికి మరోసారి మొదలైంది. అటు కరోనా.. ఇటు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 1,525కు చేరగా.. 33వేల 750 కరోనా కేసులు నమోదయ్యాయి. 123 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. ప్రస్తుతం దేశంలో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కోలుకున్నవారి సంఖ్య 3,42,95,407 చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఒక శాతం కంటే తక్కువగా అంటే 0.23 శాతం ఉంది. అదే సమయంలో, గత 24 గంటల్లో 6,960 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది.

దేశంలో రికవరీ రేటు 98.20 శాతం

భారతదేశంలో కరోనా వైరస్ కోసం ఆదివారం 8,78,990 నమూనా పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత దేశంలో నమూనా పరీక్ష సంఖ్య ఇప్పుడు 68,09,50,476కి పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.20 శాతంగా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 145.68 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వబడినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో 1,700 ఓమిక్రాన్ రోగులు

ఆదివారం నాడు దేశంలో 23,30,706 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, భారతదేశంలో మొత్తం టీకా సంఖ్య ఇప్పుడు 1,45,68,89,306కి పెరిగింది. ఇక దేశంలో ఓమిక్రాన్ వేరియంట్‌లతో సోకిన రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ఈ వేరియంట్ మొత్తం కేసులు ఇప్పుడు 1,700కి పెరిగాయి.

దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 23,30,706 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,68,89,306 కు చేరింది.

కేంద్రం సూచనలు..

ICU పడకలు, ఆక్సిజన్ బెడ్‌లు, పీడియాట్రిక్ ICU/HDU బెడ్‌ల పరంగా ECRP-II కింద భౌతిక పురోగతిని వేగవంతం చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మానవ వనరుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడం, అంబులెన్స్‌ల సకాలంలో లభ్యత, సంస్థాగత నిర్బంధం కోసం కోవిడ్ సౌకర్యాలను అమలు చేయడానికి రాష్ట్రాలు సంసిద్ధంగా ఉండాలని సూచించింది. వీటితోపాటు సహా టెలి-మెడిసిన్, టెలి-కన్సల్టేషన్ కోసం ఐటి సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించాలని రాష్ట్రాలు/యుటిలు కోరింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో, కేంద్ర మంత్రివర్గం కొత్త రూ. 23,123 కోట్ల ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌తోపాటు హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ, ఫేజ్-II (ECRP-II)కి ఆమోదం తెలిపింది. ఆమోదించబడిన ప్రణాళిక ప్రకారం సెకెండ్ వేవ్‌లో రాష్ట్రాలు వారి అనుభవాన్ని అందించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా కేంద్రం 23,056 ఐసియు పడకల ఏర్పాటుకు ప్రణాళికను ఆమోదించింది.

ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..