Maharashtra : 9 ఏళ్ల క్రితం పోయిన కంటి చూపు.. కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చింది..! మహారాష్ట్రలో ఓ మహిళకు వింత అనుభవం
Maharashtra : మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి షాకింగ్ న్యూస్ వెలువడింది. 9 సంవత్సరాల క్రితం ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ప్రస్తుతం కొవిడ్
Maharashtra : మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి షాకింగ్ న్యూస్ వెలువడింది. 9 సంవత్సరాల క్రితం ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంతో చూపు తిరిగొచ్చింది. వాషిమ్‌లోని రిసోడ్ ప్రాంతం బందర్‌వాడిలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళకు వింత అనుభవం ఎదురైంది. 70 ఏళ్ల మధురభాయ్ పదేళ్ల క్రితం కళ్లలో శుక్లాలు ఏర్పడటంతో చూపు కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు తిరిగొచ్చింది.
ఆమె భర్త లేనందున వారి బంధువులు రిసోడ్‌కు తీసుకువచ్చారు. జూన్ 26 న ఈ మహిళ సమీపంలో ఉన్న సమతా ఫౌండేషన్ ప్రారంభించిన టీకా కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ మొదటి డోసును తీసుకుంది. తరువాత అకస్మాత్తుగా ఈ మహిళ రెండు కళ్ళతో చూడటం ప్రారంభించింది. గత 9 సంవత్సరాలుగా కనిపించని చూపు ఒక్కసారిగా తిరిగివచ్చినట్లు తెలిపింది. ఈ విషయం విన్న అక్కడి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
టీకా తీసుకున్న రెండవ రోజు ఒక కంటిలో 30 నుంచి 40 శాతం చూపు వచ్చిందని మధురబాయి చెప్పారు. అయితే అంతకుముందు ఆమె టీకా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. బంధువుల ఒత్తిడితో ఆమె టీకా వేసుకుంది. కానీ ఒక అద్భుతం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టీకా తీసుకోవడం ద్వారా చూపు రావడాన్ని వైద్యులు ఖండించారు. వ్యాక్సిన్‌పై లోతైన అధ్యయనం చేస్తే కానీ నిజంగా కంటి చూపు వచ్చిందా.. రాలేదా అనేది తెలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మధురబాయి జీవితంలో కాంతి వచ్చింది. అది టీకా వల్ల వచ్చిందా లేదా మరేదైనా కారణంతో వచ్చిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా సంతోషంగా ఉంది.