కరోనాపై 7 ఏళ్ల ముందు జోస్యం..ఏంటీ మిస్టరీ ?
కరోనా వైరస్ ఇట్స్ కమింగ్ అంటూ ఏడేళ్ల క్రితం ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ట్విట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్ గురించి 2013లోనే అతడు ఎలా చెప్పగలిగాడనే చర్చ మొదలైంది...

కరోనా వైరస్ ఇట్స్ కమింగ్ అంటూ ఏడేళ్ల క్రితం ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ట్విట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్ గురించి 2013లోనే అతడు ఎలా చెప్పగలిగాడనే చర్చ మొదలైంది. జూన్ 3, 2013 సమయం 9.02నిమిషాలకు మార్కో అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో కరోనా వైరస్ ఇట్స్ కమింగ్ అంటూ చేసిన పోస్ట్‌కి ఇప్పుడు ..66 వేల రీ ట్విట్స్, లక్షకు పైగా లైకులను సంపాదించుకుని అందరిని ఆలోచింపజేస్తోంది. వైరల్ అవుతున్న ఈ ట్విట్ సోషల్ మీడియాతో పాటుగా ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది.
ఏడేళ్ల క్రితం మార్క్ చేసిన ట్విట్‌కు కొందరు నెటిజన్లు నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ చేయగా, మరికొందరు…నువ్వు ట్విట్టర్‌ని హ్యాక్ చేసి డేట్ మార్చావా..అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అవునా ఇదింతా వాస్తవమేనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2016 డిసెంబర్ 16న సోషల్ మీడియాలో మార్క్ పెట్టిన చివరి ట్విట్ ఉండగా ఆ తర్వాతి కాలంలో అతడు ఆచూకీ లేకుండా పోయారు. అప్పటి నుంచి మళ్లీ తన ప్రస్థావన ఎక్కడా కనిపించకపోవడం గమన్హారం. అసలు మార్క్ అనే వ్యక్తి ఏవరు..? అతడి ఆచూకీ ఏమైంది..? అనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఇక, ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలను మరికొందరు వారివారి నవలల్లోనూ రాశారు. ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్ రాసిన డీన్‌కూన్స్..1981లో వుహన్ 400 అనే వైరస్ గురించి రాశారు. ఇది వుహన్‌లో ఉన్న చైనా మిలటరీ ల్యాబ్‌లో ఒక ఆయుధంగా కనుగొన్నట్లు వారు తమ పుస్తకంలో పేర్కొన్నారు. సిల్వియా బ్రౌన్ రాసిన ఎండ్ ఆఫ్ డేస్ పుస్తకంలో 2020 వరకు ఒక భయంకరమైన నిమోనియా లాంటి వ్యాధి ప్రపంచమంతా వ్యాపించి మనుషుల ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని అప్పట్లోనే రాశారు. ఆ వ్యాధికి ఎటువంటి వైద్యం, వ్యాక్సిన్ కనిపెట్టలేమని చెప్పారు.
ఓ వైపు మందులేని మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.వైరస్ కి వ్యాక్సిన్ కనుగోనే ప్రయత్నంలో అన్ని దేశాల శాస్త్రవేత్తలు నిరంతర కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కోక్కటిగా బయటపడుతున్న ఈ విషయాలన్ని నిజాలేనా..? లేదంటే యాదృశ్చికంగా జరుగుతున్నసంఘటనేలా..? అన్నది ఇప్పుడు అందరిలోనూ మిలయన్ డాలర్ల ప్రశ్నలకు తెరలేపుతోంది.
