AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

# Breaking ఢిల్లీ అధికారులకు అతిపెద్ద సవాల్.. ఏంటో తెలిస్తే షాక్

ఢిల్లీ అధికారులకు అతి పెద్ద టాస్క్ ఎదురైంది. అలాంటిలాంటి సవాల్ కాదు ఇది.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను నియంత్రించే దిశగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్దేశించిన టాస్క్ ఇది. ఈ సవాలును సరిగ్గా ఎదుర్కోకపోతే సమస్య ఏ ఒక్కరికో కాదు.. యావత్ భారత దేశ ప్రజలకు మహామ్మారి నుంచి పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.

# Breaking ఢిల్లీ అధికారులకు అతిపెద్ద సవాల్.. ఏంటో తెలిస్తే షాక్
Rajesh Sharma
|

Updated on: Mar 23, 2020 | 2:49 PM

Share

Big challenge to Delhi officers: ఢిల్లీ అధికారులకు అతి పెద్ద టాస్క్ ఎదురైంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 35 వేల మందిని చెక్ చేయాలి. వారు కూడా నార్మల్ వ్యక్తులు కాదు. హోమ్ క్వారంటైన్ అయినా వారు.. మాములు టాస్క్ కాదు కదా ఢిల్లీ అధికారుల ముందు ఉన్నది అన్న చర్చ ఇపుడు ఊపందుకుంది.

కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని దేశాలు ఎపిడమిక్ సిట్యుయేషన్ నుంచి కోలుకుంటుంటే మరికొన్ని దేశాలు సెల్ఫ్ కంట్రోల్ ని ఇంప్లిమెంట్ చేయలేక చేతులెత్తి వేస్తున్నాయి. ముందుగా వైరస్ బారిన పడిన చైనా, జపాన్, హాంగ్ కాంగ్, సింగపూర్ దేశాలు కోలుకుంటూ మానవ సంకల్పం ముందు ఏ వైరస్ నిలువ లేదని చాటుతుంటే.. ఇటలీ, ఇరాన్, అమెరికా లాంటి దేశాలు కరోనా తాకిడితో విలవిలలాడుతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా సైతం ప్రజలు కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతుంటే చేతలుడిగి చూస్తూ చైనాను నిందించే పనిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది.

ఎక్కువ విదేశీ ప్రయాణీకులు వచ్చిన సిటీగా తీవ్ర స్థాయిలో అలర్ట్ లో వున్న ఢిల్లీ నగరంలో మార్చ్ 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ఆంక్షలు విధించారు. ప్రజా రవాణా దాదాపు స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అధికారుల ముందుకు పెద్ద టాస్క్ వచ్చి పడింది. చైనాలో కరోనా వైరస్ మొదలైన నుంచి మరీ ముఖ్యానంగా మార్చ్ 1వ తేదీ నుంచి ఢిల్లీకి విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యా 35 వేలుగా గుర్తించారు. వారిలో పాజిటివ్ రాకపోయినా.. అనుమానితులుగా భావించి దాదాపు 35 వేల మందిని హోమ్ క్వారంటైన్ విధించారు. చేతులపై ముద్రలు వేసి మరీ వారందరిని ఇళ్లకే పరిమితం కావాలని.. ఇళ్లల్లో సైతం వ్యక్తిగత ఒంటరితనం (సెల్ఫ్ క్వారెంటైన్ ) లో ఉండాలని నిర్దేశించారు.

అయితే వారందరు వ్యక్తి గత ఒంటరితనాన్ని పాటిస్తున్నారా లేదా ? ఈ అంశాన్ని చెక్ చేసే బాధ్యతలను ఢిల్లీ అధికార యంత్రాంగానికి అప్పగించారు. అంత పెద్ద నగరంలో వీరందరిని నిరంతరం చెక్ చేస్తుండడం ఇపుడు ఢిల్లీ అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఢిల్లీకి చేరుకునే అన్ని మార్గాలను అక్కడి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మూసి వేసింది. నగరంలో జనసంచారంపై ఆంక్షలు విధించింది. ఈ చర్యలన్నీ ఒకెత్తు కదా.. ఇపుడు హోమ్ క్వారెంటైన్ అయినా వారిని నిరంతరం పర్యవేక్షించడమే పెద్ద సవాలుగా మారింది.