AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీ జిల్లాకి రూ. 50 లక్షల నిధులు.. సీఎం జగన్ ఆదేశాలు

తాజాగా ఏపీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులను ఉంచే క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ప్రతీ జిల్లాకు రూ.50 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని..

ప్రతీ జిల్లాకి రూ. 50 లక్షల నిధులు.. సీఎం జగన్ ఆదేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 1:38 PM

Share

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. దీంతో.. ముందుగానే భారత్‌లో వైరస్‌ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో స్టేజ్-2 నడుస్తుందని.. స్టేజ్-3కి వెళ్తే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో ముందస్తుగానే ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలనూ లాక్‌డౌన్ చేశారు సీఎంలు. అలాగే ప్రజా రవాణా రద్దు చేశామని, ఇంటి బయటికి రావొద్దని ప్రభుత్వాలు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశాయి. అత్యవసర సేవలు మినహా ఏ సంస్థలు, దుకాణాలు కూడా పని చేయవని స్పష్టం చేశాయి.

ఈ సంద్భంగా తాజాగా ఏపీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులను ఉంచే క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ప్రతీ జిల్లాకు రూ.50 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేశారు ఏపీ సీఎస్ నీలం సాహ్ని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలను బయటకు రానివ్వకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గుంపులు గుంపులుగా ప్రజలు కనిపించకూడదన్నారు.

Read more also: రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

Follow Us