రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

నిర్లక్ష్యంగా రోడ్లపై జనాలు సంచరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'జనతా కర్ఫ్యూ' అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు మార్చి 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా రోడ్లపై విపరీతంగా జనం తిరుగుతుండటంపై..

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 1:02 PM

నిర్లక్ష్యంగా రోడ్లపై జనాలు సంచరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జనతా కర్ఫ్యూ’ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు మార్చి 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా రోడ్లపై విపరీతంగా జనం తిరుగుతుండటంపై తెలంగాణ సీఎస్, డీజీపీ సీరియస్ అయ్యారు. ఈ సందర్భాగా వారు మాట్లాడుతూ.. రిజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే అంటూ ప్రజలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 1897 ఎపిడమిక్ యాక్ట్ అతిక్రమిస్తే కేసులు తప్పవంటూ సూచనలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఇతరులకు ఇబ్బందులు కలిగించినా, అనవసరంగా ఇళ్లు దాటి బయటకు వచ్చినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.

సీఎస్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, అకాడమిక్ పరీక్షలు వాయిదా వేశారన్నారు. కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేశాం. దీంతో అత్యవసరం అయితే తప్ప వేరే రాష్ట్రాలకు వెళ్లే ఛాన్స్ ఉండదు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరారు. ఇలా కొన్ని రోజులు పాటిస్తేనే.. మనం కరోనాను జయిస్తాం. లేకుంటే ఇటలీ దేశంలాగా.. మన పరిస్థతి ఉంటుందన్నారు.

లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. అయిదుగురు కంటే ఎక్కువ కలిసి తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రజలు రోడ్లపై తిరగడం ఆపేయాలన్నారు.. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదని ఆదేశించారు.. అలా వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సోమేశ్‌కుమార్‌.

కాగా తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందన్నారు. వచ్చే 10-15 రోజులు అత్యంత కీలకమైనవన్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. కరోనా తీవ్ర ప్రభావంతో ఈ లాక్‌డౌన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీవో 1897 యాక్ట్‌‌ను అమలు చేస్తామన్నారు. పబ్లిక్ సేఫ్టి, హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు డీజీ పేర్కొన్నారు.

Latest Articles