మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

ఆదివారం దేశ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ'ని విజయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునిచ్చారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సేవకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం ప్రకటించాలని కూడా కోరారు. కానీ.. చప్పట్లేంటని పెద్దఎత్తున సోషల్ మీడియాలో..

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 11:38 AM

ఆదివారం దేశ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సేవకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం ప్రకటించాలని కూడా ఆయన కోరారు. కానీ.. చప్పట్లేంటని పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు. అప్పటిదాకా సీఏఏ, ఎన్నార్సీలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి పని చేయాలని కోరితే ఎద్దేవా చేస్తారా? అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీని కించపరించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా.. కర్ఫ్యూ సమయాన్ని కూడా పెంచేశారు. అనకున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు కాలు గడప దాటనీయకుండా జగ్రత్తలు తీసుకున్నారు. ఎమర్జన్సీ తప్ప.. మిగతావారు రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా సూచించారు.

దీంతో ఏ ఏరియా చౌరస్తా దగ్గర చూసినా.. ఖాకీలే కనిపించారు. ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా పక్బందీగా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా.. కుటుంబంతో ప్రగతి భవన్‌ బయటకి వచ్చి చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు సీఎం. ఇలా.. తనేంటో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే ప్రజలకు తగిన సూచనలు కూడా జారీ చేశారు. దీంతో దీనిపై కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. ఏకంగా కేంద్ర హోంమంత్రి, ప్రధాని మోదీ తర్వత బీజేపీలో పెద్ద నేత అమిత్‌ షానే స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగ కార్యాచరణను మెచ్చుకున్నారు. కర్ఫ్యూని విజయవంతం చేయడంలో తెలంగాణే దేశంలో ముందు వరుసలో నిలిచిందని ప్రశంసించారు.

Read more also: 

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో