యశ్ సాహసం.. ఆ సినిమా కోసం అన్ని కిలోల బరువు పెరగనున్నాడా?

TV9 Telugu

26 April 2024

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కన్నడ స్టార్ యశ్. తెలుగులోనూ ఇతనికి అభిమానులున్నారు.

. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాఖీభాయ్ ప్రస్తుతం ట్యాక్సిక్ అనే ఓ గ్యాంగస్టర్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

కాగా దీంతో పాటు బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న రామయణంలోనూ యశ్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సీతా రాములుగా రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు.

ఇక ఇందులో యశ్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రావణుడి పాత్ర కోసం యశ్ 15 కిలోల బరువు పెరగనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడట రాఖీ భాయ్.

ప్రస్తుతం ట్యాక్సిక్‌  మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. దీని తర్వాతే రామాయణం సెట్ లో రాఖీ భాయ్ అడుగుపెట్టనున్నాడట.

రామాణంలో రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ వంటి ప్రముఖ నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.