రోజూ రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేస్తే ఏమవుతుంది..?

Jyothi Gadda

26 April 2024

నేటి రోజుల్లో ప్రజలు సరైన ఆహారం తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో మొటిమలు, డార్క్‌ స్పాట్స్ వంటివి సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు.

రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా చేయడానికి, వయస్సు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలను తొలగిస్తుంది. 

ముఖం మీద మొటిమలు ఉంటే రోజ్ వాటర్‌తో మసాజ్ చేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని దానిని ముఖానికి అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి.

రోజ్ వాటర్, కలబంద ముఖం పొడిగా, నిర్జీవంగా ఉంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి అప్లై చేయాలి. దీన్ని ముఖంపై 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఈ విధంగా రోజుకు 3 సార్లు చేయాలి.

రోజ్ వాటర్, గంధపు పొడి ముఖంపై ఉన్న మొటిమల గురించి ఆందోళన చెందుతుంటే రోజ్ వాటర్, గంధపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. దీనివల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. గంధపు పొడి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది ముఖం ఎరుపును తగ్గిస్తుంది.

నిజానికి రోజ్ వాటర్ ను ఎలాంటి చర్మం ఉన్నవారైనా ఉపయోగించొచ్చు. ఇది చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడటమే కాకుండా ముఖం జిడ్డును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 

మొటిమలను రాకుండా చేయడానికి, ఉన్న మొటిమలను తగ్గించడానికి అలాగే ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రోజ్ వాటర్ లో ముంచిన దూదితో మీ ముఖాన్ని తుడుచుకోవాలి. 

రోజ్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి  ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. మొటిమలొచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగించవచ్చు.