బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిన శ్రుతి హాసన్.. కారణమిదే

TV9 Telugu

26 April 2024

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ తో విడిపోయిందా? ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ 'శాంతాను హజారికా'తో  శ్రుతి హాసన్‌ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉంది. వీరి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలోనే  పలు ఫంక్షన్లు, కార్యక్రమాలు, పార్టీలు వెకేషన్లలోనూ జంటగా కనిపించారు శ్రుతి హాసన్, శాంతాను హజారికా.

అయితే ఇప్పుడీ ప్రేమ పక్షులు దూరమయ్యారని తెలుస్తోంది. ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో  ప్రచారం జరుగుతోంది.

దాదాపు నెల రోజులు శ్రుతి, శాంతను విడివిడిగా ఉన్నారని నెట్టింట టాక్. దీనికి తోడు శృతి, శాంతాను సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.

అంతేకాదు శృతి తన ఖాతా నుంచి శాంతానుతో జంటగా దిగిన  ఫొటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

కాగా శ్రుతి హాసన్ ప్రేమలో పడడం, బ్రేకప్ కావడం ఇదేమీ మొదటిసారి. గతంలోనూ ఒకసారి ఆమెకు ఇదే అనుభవం ఎదురైంది.

శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో డేటింగ్ చేసింది శృతి. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.