Good News: భారత్‌లో స్పుట్నిక్ వీ టీకా ఉత్పత్తి … సీరమ్‌కు DCGI అనుమతి
India Covid Vaccine- Good News: పూణెకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మరో కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో త్వరలోనే ఉత్పత్తిని మొదలుపెట్టనుంది.
పూణెకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మరో కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో త్వరలోనే ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. భారత్‌లో స్పుట్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ కొన్ని షరతులకు లోబడి అనుమతి మంజూరు చేసింది. రష్యా రాజధాని మాస్కోలోని గమలెయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రో బయాలజీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ హదాస్‌పూర్ కేంద్రంలో స్పుట్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది.
స్పుట్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీరమ్ గురువారం దరఖాస్తు చేసుకోగా…మరుసటి రోజే డీసీజీఐ అనుమతి మంజూరు చేయడం విశేషం. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొనడం, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు డీసీజీఐ తక్షణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. సీరమ్‌కు జారీ చేసిన లైసెన్స్ జూన్ 4 తేదీ నుంచి మూడేళ్ల వరకు అమలులో ఉంటుందని డీసీజీఐ తెలిపింది.
ఇప్పటికే కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను సీరమ్ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే స్పుట్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా మొదలుపెడితే దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే..!