Kannababu : ఇంతకీ చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా..? ఏ కంపెనీ టీకా వేయించుకున్నారో ప్రజలకు చెప్పాలి : మంత్రి
45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా.. వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. ఏపీలోనా...లేక తెలంగాణలోనా?. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వేయించుకున్నారా?. కోవి షీల్డ్ వేయించుకున్నారా?.
Kurasala Kannababu slams Chandrababu : అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా? అంటూ తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పెలా అవుతుందని ఆయన నిలదీశారు. వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ కడుతుంది ఇల్లు కాదు.. ఊళ్లు.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా?. ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా ?. అని ఆయన ప్రశ్నల వర్షం కురింపించారు.
వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా?. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా.. వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. ఏపీలోనా…లేక తెలంగాణలోనా?. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వేయించుకున్నారా?. కోవి షీల్డ్ వేయించుకున్నారా?. అనేది ప్రజలకు చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు.