అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లకు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ధన్యవాదాలు…..ఎందుకంటే …?

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ లకు సీరం సంస్థ సిఈఓ ఆదార్ పూనావాలా కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తోడ్పడే ముడిపదార్థాలపై గల ఆంక్షలను అమెరికా ఎత్తివేసినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,  భారత విదేశాంగ మంత్రి  జైశంకర్ లకు  సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ధన్యవాదాలు.....ఎందుకంటే ...?
Adar Poonawalla
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 05, 2021 | 9:40 AM

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ లకు సీరం సంస్థ సిఈఓ ఆదార్ పూనావాలా కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తోడ్పడే ముడిపదార్థాలపై గల ఆంక్షలను అమెరికా ఎత్తివేసినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్థానిక టీకామందుల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు అమెరికా గత ఫిబ్రవరిలో ఈ బ్యాన్ విధించింది. ఫైజర్ సహా ఇతర వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన ‘ రా మెటీరియల్స్’ పై ఆంక్షలు విధించింది. వీటిని రద్దు చేయాలని ఇండియా కొంతకాలం క్రితమే కోరింది. అయితే అమెరికా తన పాలసీ విధానంలో మార్పులు చేస్తూ తాజాగా ఈ బ్యాన్ ను ఎత్తివేయడంతో ఇక ఇండియా వంటి దేశాలకు ఎంతో సౌలభ్యం కలిగింది. అమెరికా నిర్ణయం వల్ల ఇండియాలో తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింతగా పెంచుకోగలుగుతామని ఆదార్ పూనావాలా అన్నారు. కాగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఇందుకు స్పందిస్తూ ఇండియాలో వ్యాక్సిన్ సప్లయ్ కి ఎలాంటి అవరోధం లేకుండా చూడాలన్నదే మన డిప్లొమసీ అని ట్వీట్ చేశారు. తన డిఫెన్స్ చట్టం కింద అమెరికా వ్యాక్సిన్ ముడిపదార్ధాల ఎగుమతులను గతంలో నిషేధించింది.

జులై 4 కల్లా తమ దేశ జనాభాకంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి…ముఖ్యంగా ఇండియాలో దీని కొరతను నివారించేందుకు జైశంకర్ గత నెలలో అమెరికాకు వెళ్లి అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. అలాగే విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ తోనూ సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలించాయి. తాము 25 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ని ఇండియాకు, ఇతర దేశాలకు పంపుతామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇటీవల ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలిపారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్… త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… ( వీడియో )

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?