గబ్బిలాల గుహలో చైనా పరిశోధకులు…వైరస్ లీక్ థియరీ….అనుమానాలకు బలాన్నిస్తున్న చైనా టీవీ వీడియో

చైనా వూహాన్ ల్యాబ్ థియరీ రోజురోజుకీ పెద్దదవుతోంది. ఎవరూ చొరబడలేని గబ్బిలాల గుహలో ప్రత్యేక సూట్లు ధరించి రీసెర్చర్లు పరిశోధన చేస్తున్న వీడియో ఒకటి బయటపడింది.

గబ్బిలాల గుహలో చైనా పరిశోధకులు...వైరస్ లీక్ థియరీ....అనుమానాలకు బలాన్నిస్తున్న చైనా టీవీ వీడియో
Gravitas
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 05, 2021 | 11:32 AM

చైనా వూహాన్ ల్యాబ్ థియరీ రోజురోజుకీ పెద్దదవుతోంది. ఎవరూ చొరబడలేని గబ్బిలాల గుహలో ప్రత్యేక సూట్లు ధరించి రీసెర్చర్లు పరిశోధన చేస్తున్న వీడియో ఒకటి బయటపడింది. వీరి ‘కృషి’ ఫలితంగా వూహాన్ ల్యాబ్ 22 వేల వైరస్ శాంపిల్స్ కి సంబంధించి డేటా బేస్ ను సేకరించింది. అయితే దీన్ని ‘ఆఫ్ లైన్’ లో..అంటే రహస్యంగా ఉంచింది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మూడు నెలల ముందు ఈ ల్యాబ్ దీన్ని విశ్లేషించింది. సార్స్- వైరస్ గా మొదట దీన్ని వ్యవహరించారు.కోవిద్ వైరస్ పుట్టుక గురించి నిర్ధారణగా ఇప్పటికీ తెలియాల్సి ఉంది. 22 వేల వైరస్ శాంపిల్స్ ను సేకరించిన పరిశోధకుల బృందంలో చైనా సైనికులు కూడా ఉన్నారట.. ఈ వీడియో థియరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. వూహాన్ ల్యాబ్ లీక్ థియరీని ఆయా దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. షీ జెంగ్లీ అనే మహిళా శాస్త్రజ్ఞురాలిని ప్రపంచం’బ్యాట్ వుమన్’ గా గుర్తించిన సంగతి విదితమే.. ఆమె కూడా గబ్బిలాల గుహల్లో తన బృందంతో సుమారు దశాబ్దం పాటు వివిధ వైరస్ శాంపిల్స్ ను సేకరించింది. 2019 డిసెంబరు 9 కి మూడు వారాల ముందు వూహాన్ మున్సిపల్ కమిషనర్ తాము న్యుమోనియా వంటి వైరస్ ను గుర్తించామన్నారు. సార్స్ కు సంబంధించిన వంద వైరస్ లను కూడా గుర్తించామన్నారు.

కాగా వూహాన్ ల్యాబ్ రీసెర్చర్లతో లింక్ కలిగిన బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు డా. పీటర్ దస్ జాన్ ..తను పాండమిక్ ప్రివెన్షన్ కోసం పాటుపడ్డానని చెప్పుకున్నారు. వూహాన్ ల్యాబ్ థియరీని నేను ఖండిస్తున్నానని, అయితే కరోనా వైరస్ ని సులభంగా మానిప్యులేట్ చేయగలిగే సత్తా చైనా రీసెర్చర్లకు ఉందని ఆయన పేర్కొన్నారు.వూహాన్ ల్యాబ్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ డెప్యూట్ చేసిన నిపుణుల బృందంలో ఈయన కూడా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: CM Jagan: విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

RRR : AP CID అడిషినల్ డీజీకి లీగల్ నోటీసులు పంపించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు