Viral Video: వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మ పట్టుకున్న మహిళ.. క్షణాల్లో కాపాడిన రెస్క్యూ బృందం
Woman Rescue - Viral Video: వరదలో కొట్టుకు వెళుతున్న మహిళను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగవైరల్ అవుతోంది. ఈ సంఘటన
Woman Rescue – Viral Video: వరదలో కొట్టుకు వెళుతున్న మహిళను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగవైరల్ అవుతోంది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో మే 24న చోటుచేసుకుంది. ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. కారులో వెళ్తున్న మహిళ దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. మహిళ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న క్రమంలో ఓ చెట్టు కొమ్మ పట్టుకోని ఆగిపోయింది. ఎవరైనా సహాయం చేస్తారా… అంటూ కేకలు సైతం వేసింది. ఈ ప్రాంతంలో సహాయయ చర్యలు చేపడుతున్న ఫోర్ట్ వర్త్ అగ్నిమాపక సిబ్బంది.. ఆమెను సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆమెకు ఏంకాదంటూ భరోసానిచ్చారు. అనంతరం మరికొంతమంది సహాయంతో తాడు ద్వారా ఒకతను ఆమె దగ్గరకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే అతను ఆ మహిళకు లైఫ్ జాకెట్ ఇచ్చారు. అనంతరం ఆమెకు తాడును కట్టారు. ఇద్దరిని సిబ్బంది లాగగా.. వారు సురక్షితంగా నీటి ప్రవాహం నుంచి బయటపడ్డారని ఫోర్ట్ వర్త్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఆమెను సురక్షితంగా రక్షించింది మైఖేల్ డ్రివ్‌డాల్ అంటూ అగ్నిమాపక దళం పేర్కొంది. కాగా.. ఆమెను కాపాడిన సిబ్బందిని అందరూ అభినందించారు. దీనిని అక్కడున్న స్థానికుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
వీడియో..
Also Read: