Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి ట్విట్టర్ బ్లూ టిక్ తొలగించిన యాజమాన్యం.. కారణం ఏమై ఉంటుంది?
Venkaiah Naidu: సాధారణంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకు, సంస్థల ట్వట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్‌ను అందిస్తారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు...
Venkaiah Naidu: సాధారణంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకు, సంస్థల ట్వట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్‌ను అందిస్తారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. ఇదిలా ఉండే అధికారిక ఉపరాష్ట్రతి సెక్రటేరియట్ ట్విట్టర్ హాండిల్‌కు బ్లూ టిక్ అలాగే కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నత హోదాలో ఉన్నవ్యక్తి ఐడీ బ్లూ టిక్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా కొన్ని రోజులుగా క్రీయాశీలకంగా లేదని అందుకే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది. కొన్ని నెలలుగా క్రియాశీలకంగా లేని అకౌంట్‌లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను తొలిగిస్తామని ట్విట్టర్ తన నియమనిబంధనలో తెలిపింది. ఇక సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధిస్తోన్న పలు నిబంధనల నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక వెంకయ్య నాయుడు అకౌంట్‌లో బ్లూ ట్యాగ్ తొలగించడం పట్ల ట్విట్టర్ ప్రతినిధి మాట్లాడుతూ.. గతేడాది జూలై నుంచి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ క్రీయాశీలకంగా లేని కారణంగా బ్లూ టిక్‌ను తొలగించి ఉండొచ్చు. బ్లూటిక్‌ను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు.
Twitter withdraws blue verified badge from personal Twitter handle of Vice President of India, M Venkaiah Naidu: Office of Vice President pic.twitter.com/vT8EZ5O9Na
— ANI (@ANI) June 5, 2021
Also Read: Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?