Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?

Covid Third Wave News Alert: కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా...దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సెకండ్ వేవ్‌ కట్టడి, ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?
Corona Third Wave
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 05, 2021 | 9:50 AM

కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా…దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సెకండ్ వేవ్‌ కట్టడి, ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో దేశం విజయం సాధించిందని…అందుకే దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సెకండ్ వేవ్‌ను కట్టడి చేసిన తీరు పట్ల సంతృప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు. మన శాస్త్రసాంకేతికత, ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రైల్వే సేవల వినియోగం, విమానాశ్రయాల వినియోగం, ఆర్మీ సేవల వినియోగం తదితర చర్యలు మంచి ఫలితాలు ఇచ్చినట్లు విశ్లేషించారు. గతంలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు నమోదయ్యేవని…ఇప్పుడు ఆ సంఖ్యను 1.3 లక్షల స్థాయికి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. అదే సమయంలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధంకావాల్సిన అవసరముందన్నారు.

థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు? దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చన్న ప్రశ్నకు కూడా వీకే సారస్వత్ సమాధానం ఇచ్చారు. దేశంలో థర్డ్ వేవ్ రావడం తథ్యమన్నది వైద్య నిపుణుల అభిప్రాయంగా చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటిలోగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నారులు, యువకులపై ఉండొచ్చని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు విశ్లేషించడం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియతో మాత్రమే థర్డ్ వేవ్‌తో పాటు తదుపరి వేవ్‌లను కట్టడి చేయగలమని వారు సూచిస్తున్నారు.

సెకండ్ వేవ్‌కు ముందు తొలి వేవ్‌ను కూడా దేశం సమర్థవంతంగా కట్టడి చేయగలిగినట్లు వీకే సారస్వత్ చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ మ్యానేజ్‌మెంట్‌లో దేశం పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి..

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లకు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ధన్యవాదాలు…..ఎందుకంటే …

Twitter Ban: ఆ దేశంలో ట్విట్టర్‌‌ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..

ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు