Multivitamin Tablets: మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే..!

ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న కరోనా భయం అంతా ఇంతా కాదు. అందుకే.. వైరస్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రాకుండా ఏలాంటి మందులు వాడాలి?

Multivitamin Tablets: మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే..!
Dangers Of Taking A Multivitamin, Calcium Tablets Every Day, Say Experts
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 04, 2021 | 9:03 PM

Dangers of Heavy Taking a Multivitamin: ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న కరోనా భయం అంతా ఇంతా కాదు. అందుకే.. వైరస్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రాకుండా ఏలాంటి మందులు వాడాలి? ఏం చేయాలి? అనే ఆలోచనతో జనం పరుగులు తీస్తున్నారు. వ్యాధి రాకుండా ఉండాలంటే.. ఇమ్యూటీ కావాలి. దీని కోసం విటమిన్‌, కాల్షియం టాబ్లెట్స్‌ వాడేస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా ఆన్‌లైన్ జ్ఞానంతో తినేస్తున్నారు. దీంతో వీటి వాడకం ఏకంగా 110 శాతం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు కాల్షియం, మల్టీవిటమిన్‌ టాబ్లెట్ల వాడకం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. దీని వల్ల మోతాదుకు మించి శరీరంలో కాల్షియం శాతం పెరిగిపోతోంది. ప్రాణాంతకమంటున్నారు వైద్యులు. దీంతో ఒకరిద్దరు కాదు చాలా మంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాధులు లేనివారు దీర్ఘకాలిక రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. కాల్షియం నిల్వలు పెరిగిపోతే గుండె ఆగి ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రచారంతోనే ప్రజలు ఇలా తప్పు దారి పడుతున్నారని.. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల విటమిన్లు అందుతాయని చెప్పి కొందరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్‌, మినరల్స్‌ వంటి డైటరీ సప్లిమెంట్స్‌ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్‌ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్‌ ప్రణీత్‌ హెచ్చరిస్తున్నారు. ఓవైపు పౌష్టికాహారం తీంటూనే… మరోవైపు వైద్యుల సూచనల మేరకు టాబ్లెట్లను వాడటం మంచిదంటున్నారు. తద్వారా తమకు కరోనా సోకదనే ధైర్యం వారిలో కనిపిస్తోందంటున్నారు.

Read Also…  Mother cut throat her Kid: ఆ దృశ్యం చూస్తే తిండి సహించదు, నిద్రపట్టదు.. మూడేళ్ల కన్నబిడ్డను బ్లేడుతో గొంతు కోసిన కసాయి తల్లి..!

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు