Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. తాజాగా 2,175 పాజిటివ్ కేసులు నమోదు..
Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ..
Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,36,096 మంది శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 2,175 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 3,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 30,918 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పటి వరకు 5,87,664 మంది కరోనా బారిన పడగా.. 5,53,400 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.16 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 253 కేసులు నమోదవగా.. జిల్లాల్లో 1,922 కేసులు నమోదు అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 8, భద్రాద్రి కొత్తగూడెం – 110, జీహెచ్ఎంసీ – 253, జగిత్యాల – 59, జనగాం – 40, జయశంకర్ భూపాలపల్లి – 71, జోగులాంబ గద్వాల్ – 28, కామారెడ్డి – 9, కరీంనగర్ – 113, ఖమ్మం – 144, కొమురం భీమ్ ఆసిఫాబాద్ – 11, మహబూబ్‌నగర్ – 75, మహబూబాబాద్ – 73, మంచిర్యాల – 72, మెదక్ – 21, మేడ్చల్ మల్కాజిగిరి – 81, ములుగు – 59, నాగర్ కర్నూల్ – 31, నల్లగొండ – 178, నారాయణ పేట్ – 12, నిర్మల్ – 5, నిజామాబాద్ – 29, పెద్దపల్లి – 87, రాజన్న సిరిసిల్ల – 63, రంగారెడ్డి – 101, సంగారెడ్డి – 35, సిద్దిపేట్ – 81, సూర్యాపేట – 80, వికారాబాద్ – 51, వనపర్తి – 39, వరంగల్ రూరల్ – 33, వరంగల్ అర్బన్ – 69, యాదాద్రి భువనగిరి – 54 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read: