Mother cut throat her Kid: ఆ దృశ్యం చూస్తే తిండి సహించదు, నిద్రపట్టదు.. మూడేళ్ల కన్నబిడ్డను బ్లేడుతో గొంతు కోసిన కసాయి తల్లి..!

పాము తన పిల్లల్ని తానే చంపుకుని తింటుందని అంతా అంటారు. అది నిజమో కాదో తెలీదు. కానీ, అంతకంటే దుర్మార్గం నారాయణ్‌పేట్‌ జిల్లాలో జరిగింది.

Mother cut throat her Kid: ఆ దృశ్యం చూస్తే తిండి సహించదు, నిద్రపట్టదు.. మూడేళ్ల కన్నబిడ్డను బ్లేడుతో గొంతు కోసిన కసాయి తల్లి..!
Crime News
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 04, 2021 | 8:39 PM

Mother behead Three Year Old Daughter: పాము తన పిల్లల్ని తానే చంపుకుని తింటుందని అంతా అంటారు. అది నిజమో కాదో తెలీదు. కానీ, అంతకంటే దుర్మార్గం నారాయణ్‌పేట్‌ జిల్లాలో జరిగింది. తాను జన్మనిచ్చిన బిడ్డను, తాను అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నబిడ్డపై కనీవినీ ఎరగని కర్కశత్వం చూపిందో కసాయి తల్లి.

భార్యాభర్తల మధ్య గొడవ మూడేళ్ల చిన్నారి పీకలమీదకొచ్చింది. తన తల్లి ఒడే తనకు మృత్యు కౌగిలి అవుతుందని.. ఆ పసిగుండె పసిగట్టలేకపోయింది. లాలించాల్సిన కన్న తల్లే.. గొంతు కోస్తుందని తెలుసుకోలేకపోయింది.

ఇది నారాయణ్‌పేట్‌ జిల్లాలోని పులిమామిడి గ్రామం. అన్ని గ్రామాల్లో మాదిరి ఇక్కడ కూడా వ్యవసాయం చేసుకుంటూ.. ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉంటారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఓ తల్లి ప్రదర్శించిన కర్కశత్వానికి… గ్రామం మొత్తం ముక్కున వేలేసుకుంది.

పులిమామిడి గ్రామానికి చెందిన రమేష్‌, మంజుల దంపతులకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లలో పెద్ద కొడుకు శివ పుట్టిన రోజు కావడంతో ఇళ్లంతా సందడిగా మారింది. దగ్గర వాళ్లను పిలుచుకుని.. అంతా కలిసి హ్యాపీగానే వేడుకలు జరుపుకున్నారు.

ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి.. భార్యాభర్తల మధ్య ఓ చిన్న గొడవ జరిగింది. వాళ్ల కేకలతో ఇళ్లంతా.. భయానక వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన తల్లి మంజుల.. మానవత్వం, ప్రాణం విలువ మర్చిపోయి మూడేళ్ల కూతురు శివాని గొంతును బ్లేడుతో కోసింది.

ఇంత దారుణమా? అసలామె తల్లేనా? ఏ తల్లికైనా బిడ్డల మీద ఇలాంటి కర్కశత్వం ఉంటుందా అనిపించేలా ఆ పసిబిడ్డను చూస్తే అనిపించింది. గొంతు తెగిన ప్రాంతం నుంచి తీవ్రంగా రక్తస్రావమవుతోంది. కనీసం పీల్చుతున్న వదులుతున్న గాలి కూడా ముక్కుదాకా వెళ్లేపరిస్థితిలేదు. గొంతు కోసిన చోటు నుంచే బుడగల రూపంలో బయటకు వస్తూ.. అయ్యో చిట్టితల్లీ ఎంత కష్టం అని ప్రతీఒక్కరూ కన్నీరు పెట్టుకునేలా చేసింది ఆ దృశ్యం. కన్నతల్లి కర్కశత్వాన్ని పోలీసులు ప్రశ్నిస్తే.. ఆమెకు మతిస్థిమితం లేదని చెప్పుకొచ్చాడు ఆమె భర్త రమేష్‌. తల్లేంటీ ఇలా చేయడమేంటని అంతా గుండెలు బాదుకుంటుంటే.. ఇలాంటి తల్లులూ ఉన్నారని చెప్పడానికే ఈ కథనం.

ఈ ఘటనతో తేరుకున్న తండ్రి రమేష్.. శివానిని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ విషమ పరిస్థితుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఆస్పత్రిలో చేరే సమయానికి.. చిన్నారి కండీషన్ చూసి డాక్టర్లు కూడా నిర్ఘాంతపోయారు.

ప్రియుడి మోజులో బిడ్డలను చంపుకునే తల్లులు, భార్యాభర్తల మధ్య తగువులతో బిడ్డల ఉసురు తీస్తున్న దంపతులు ఈ మధ్య తరచూ కనిపిస్తున్నారు. వాళ్లందరికీ కనువిప్పు కలగాలి. అభంశుభం తెలియని బిడ్డల బాల్యాన్ని, వాళ్ల ప్రాణాన్ని హరించే హక్కు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులకే కాదు.. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అది మరిచి మీరు క్షణికావేశం ప్రదర్శిస్తే.. కోపం చల్లారదు సరికదా, జీవితాంతం క్షణక్షణం చచ్చినా ఆ పాపం, నేరం తీరదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  AP High Court: ‘అమూల్‌’ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఎంవోయూపై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని ఆదేశం!