AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thane Sex Racket Busts: కరోనా కరువు కాలంలో దారితప్పుతున్న తారాలోకం.. ఈజీమనీ కోసం స్టార్‌ స్టేటస్‌తో దందా!

కరోనాతో కరువొచ్చి పడింది. బుల్లితెర నుంచి వెండితెరదాకా పెద్దగా బేరాల్లేవ్‌. ఈ కరువు కాలంలో కొందరు తారలు ఈజీమనీకోసం దారి తప్పుతున్నారు. మహారాష్ట్రలో బట్టబయలైన సెక్స్‌రాకెట్‌ గుట్టు.

Thane Sex Racket Busts: కరోనా కరువు కాలంలో దారితప్పుతున్న తారాలోకం.. ఈజీమనీ కోసం స్టార్‌ స్టేటస్‌తో దందా!
Maharashtra Police Busted Sex Racket In Thane
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 9:49 PM

Share

Mumbai Actress Arrested in Thane: కరోనాతో కరువొచ్చి పడింది. బుల్లితెర నుంచి వెండితెరదాకా పెద్దగా బేరాల్లేవ్‌. ఈ కరువు కాలంలో కొందరు తారలు ఈజీమనీకోసం దారి తప్పుతున్నారు. మహారాష్ట్ర బట్టబయలైన సెక్స్‌రాకెట్‌.. టీవీ, సిన్మా ఇండస్ట్రీల్లో కలకలం రేపుతోంది.

ఎలాగూ సిన్మాల్లేవు.. సంపాదనకి షాట్‌ కట్‌ ఉందంటూ రొంపిలోకి దించుతున్నారు. డబ్బు ఆశచూపి నేమ్‌ అండ్‌ ఫేమ్‌ ఉన్న తారల్ని ట్రాప్‌చేస్తున్నారు. ఫలానా అని గుర్తుపట్టగల వెండితెర హీరోయిన్లని, టీవీ తారలు, మోడల్స్‌ని.. వ్యభిచారకూపంలోకి దించుతున్నాయి దుర్మార్గపు ముఠాలు. మహారాష్ట్రలోని థానేలో బయటపడ్డ సెక్స్‌రాకెట్‌ సంచలనం సృష్టిస్తోంది.

పాపులర్‌ పర్సనాలిటీస్‌కి గాలమేయడానికి కరోనా టైం కరెక్టనుకుంటున్నాయి ఘరానా కేటుగాళ్లు. థానేలో బయటపడ్డ రాకెట్‌ కూడా అలా పుట్టుకొచ్చిందే. ఛాన్సుల్లేక ఖాళీగా ఉన్న తారలే ఈ గ్యాంగ్‌ టార్గెట్‌. మాటలతో మభ్యపెట్టి, సంపాదన ఆశచూపి ముగ్గులోకి లాగుతున్నారు. స్టార్స్‌గా వారికున్న క్రేజ్‌ని మార్కెట్‌ చేసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది ఓ గ్యాంగ్‌.

పక్కా సమాచారంతో నౌపాడా పాంచ్‌పాఖాడి ఏరియాలో అపార్ట్‌మెంట్‌పై రైడ్‌ చేసిన పోలీసులు.. ఇద్దరు సినీ తారల్ని రక్షించారు. ఆ ఇద్దరూ దక్షిణాది సిన్మాల్లో మోడల్స్‌గా నటించినవాళ్లే. మారువేషంలో మొదట స్పాట్‌కి ఓ వ్యక్తిని పంపిన పోలీసులు.. దందా నిజమేనని ధ్రువీకరించుకున్నారు. పక్కా ఫ్లాన్‌తో దాడి చేసి ముఠాని పట్టుకున్నారు. ఇద్దరు మోడల్స్‌ని రక్షించి.. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఫ్లాట్‌ ఓనర్‌ స్వీటీతో పాటు ఏజెంట్లు హసీనా ఖాలిద్‌, విశాల్ అలియాస్ సునీల్‌ని అరెస్ట్‌చేశారు.

కస్టమర్‌లా వెళ్లిన పోలీసు బేరసారాలాడి లక్షా 80వేలిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత రైడ్‌ చేసిన పోలీసులు ఈ దందా ఎప్పట్నించి సాగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. సినీ తారలకున్న క్రేజ్‌ని కరోనా టైంలో ముఠా సొమ్ముచేసుకుంటోందని గుర్తించారు. ఎంతయినా ఖర్చుపెట్టే బడాబాబులే ఈ సెక్స్‌రాకెట్‌ కస్టమర్లు. హైసర్కిల్‌కి ఎర వేస్తోందీ గ్యాంగ్‌. సెలబ్రిటీలున్నారని, ఏ రిస్కూ ఉండదని చెబుతూ.. రెసిడెన్షియల్‌ ఏరియాలోనే దందాకి తెరలేపింది.

కష్టకాలంలో డబ్బు వస్తుందని ఆశచూపి తారల్ని రంగంలోకి దించుతారు. మొదట వాళ్ల ఇష్ట ప్రకారం అన్నట్లే మొదలవుతుంది. తర్వాత ముఠా కబంధహస్తాల్లో చిక్కుకుపోతారు. ఇలాంటి జీవితం వద్దనుకున్నా వారి చేతుల్లో ఉండదు. ఈ రాకెట్‌ ఎవరెవరిని సంప్రదించింది.. ఇంకా తారలెవరయినా వీరితో కాంటాక్ట్‌లో ఉన్నారా అన్నదానిపై లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. నిర్వాహకురాలితో పాటు దొరికిన ఇద్దరు ఏజెంట్లపైనా కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితుల్ని న్యాయస్థానం ఈనెల 7దాకా పోలీసు కస్టడీకి అనుమతించింది.

సెక్స్‌రాకెట్‌ ముఠానుంచి రక్షించిన ఇద్దరు తారల్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు. వారి ఆర్థిక అవసరాల్ని ముఠా తమకు అనుకూలంగా మార్చుకుందని గుర్తించారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సిన్మాల్లో అవకాశాల్లేకపోవడంతో ఈజీగా ముఠా ట్రాప్‌లో చిక్కారు. వారి వీడియోలు తీసుకుని నిర్వాహకులు బ్లాక్‌మెయిల్‌ చేశారు. పోలీసులు కాపాడిన ఇద్దరు తారలు కొన్ని తమిళ, హిందీ సిన్మాలతో పాటు సీరియల్స్‌లో నటించారు.

లాక్‌డౌన్‌లో అవకాశాల్లేకపోయినా.. డబ్బులు వచ్చే మార్గం ఉందంటూ..వీళ్లని రొంపిలోకి దించింది సెక్స్‌రాకెట్‌ ముఠా. చివరికి పోలీసుల ఆపరేషన్‌తో ఆ ఉచ్చునుంచి బయటపడ్డారు. ముఠా దొరక్కపోతే ఆ సినీ తారలు వ్యభిచార ఊబిలో కూరుకుపోయేవారంటున్నారు పోలీసులు. గ్యాంగ్‌ దగ్గర ఇండస్ట్రీకి చెందిన మరికొందరు సెలబ్రిటీల నెంబర్లు దొరకటంతో.. వారిని కూడా ట్రాప్‌ చేసే పనిలో ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నాచితకా కేరక్టర్స్‌ వేసుకునే కొందరు ఇలాంటి ముఠాలకు ఈజీగా ట్రాప్‌ అవుతున్నారు. దీంతో నయాదందాపై ఫోకస్‌పెట్టింది ముంబై క్రైమ్‌బ్రాంచ్‌.

Read Also…. AP IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌‌కు స్థానచలనం