INCOME TAX Refund Status: ఐటీఆర్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఐటీ శాఖ ప్రకటన
INCOME TAX Refund Status News: మీరు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారా? ఆదాయపన్ను ఎక్కువగా చెల్లించి ఐటీ శాఖ నుంచి రీఫండ్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారా? దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ శుక్రవారం ఓ ముఖ్య ప్రకటన చేసింది.
ITR Refund Alert: మీరు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారా? ఆదాయపన్ను ఎక్కువగా చెల్లించి ఐటీ శాఖ నుంచి రీఫండ్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారా? దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ శుక్రవారం ఓ ముఖ్య ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండు మాసాల్లో 15.47 పన్ను చెల్లింపుదారులకు సంబంధించి రూ.26,276 కోట్లను రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 15.02 లక్షల మందికి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపన్ను రీఫండ్స్ రూ.7,538 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. అలాగే 44,431 సంస్థలకు సంబంధించిన కార్పొరేట్ పన్ను రీఫండ్‌ను రూ.18,738 చెల్లించినట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. మే నెలాఖరు వరకు ఐటీ రీఫండ్‌ను పన్నుచెల్లింపుదాలకు బ్యాంకు ఖాతాల్లో జప చేసినందున…పన్ను చెల్లింపుదారులు వారి బ్యాంకు ఖాతాల్లో దీన్ని చెక్ చేసుకోవాలి.
ఏప్రిల్ 1, 2021 నుంచి మే 31, 2021 మధ్యకాలంలో ఈ రీఫండ్స్ చేసినట్లు ఆదాయపన్ను శాఖ ట్వీట్టర్‌లో తెలిపింది. ఈ రీఫండ్స్ ఏ సంవత్సరానికి సంబంధించినదన్న వివరాలు ఆ ప్రకటనలో లేదు. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి ఈ రీఫండ్స్ చెల్లించినట్లు తెలుస్తోంది.
CBDT issues refunds of over Rs. 26,276 crore to more than 15.47 lakh taxpayers between 1st April, 2021 to 31st May, 2021. Income tax refunds of Rs. 7,538 crore have been issued in 15,02,854 cases & corporate tax refunds of Rs. 18,738 crore have been issued in 44,531 cases.
— Income Tax India (@IncomeTaxIndia) June 4, 2021
2021 మార్చి 31నాటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను శాఖ 2.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు 2.62 లక్షల కోట్లు రీఫండ్ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.83 లక్షల కోట్లు రీఫండ్ చేసిన ఐటీ శాఖ…2020-21లో 43.2 శాతం ఎక్కువగా రీఫండ్ చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం