AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pfizer Covid Vaccine: డెల్టా వేరియంట్‌ కట్టడిలో ఫైజర్ వ్యాక్సిన్ వెనుకంజ.. లాన్సెట్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు.. !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న వేళ.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్‌లు పెద్ద సవాల్‌గా మారాయి.

Pfizer Covid Vaccine: డెల్టా వేరియంట్‌ కట్టడిలో ఫైజర్ వ్యాక్సిన్ వెనుకంజ.. లాన్సెట్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు.. !
Pfizer
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 7:01 PM

Share

Pfizer Jab Produces Less Antibodies: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న వేళ.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్‌లు పెద్ద సవాల్‌గా మారాయి. ఈ కొత్తరకాలను ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయా అనే కోణంలో ఇప్పటికే అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వేరియంట్‌పై ఫైజర్‌ టీకా పాక్షికంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం డెల్టా వేరియంట్‌ కేసులతో కరోనా తీవ్రత మరింతగా పెరిగింది. వివిధ దేశాల్లో పంపిణీ చేస్తోన్న ఫైజర్‌ వ్యాక్సిన్‌ కాస్త తక్కువ సామర్థ్యం కలిగివుందని వైద్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్‌, ఐర్లాండ్‌, ఇజ్రాయెల్‌లలోనూ కొత్త వేరియంట్‌లు వెలుగు చూశాయని ఆయా దేశాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపాయి.

ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ ఒక మోతాదు తర్వాత, B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీ స్థాయిలను అభివృద్ధి చేసే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.టీకాల మధ్య మోతాదు అంతరాన్ని తగ్గించడానికి ఇది బ్రిటన్‌లో ప్రస్తుత ప్రణాళికలకు మద్దతు ఇస్తుంది. గతంలో ఆధిపత్యం వహించిన B.1.1.7 (ఆల్ఫా) వేరియంట్‌కు వ్యతిరేకంగా, మొదట కెంట్‌లో గుర్తించారు.

బ్రిటన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల నేతృత్వంలోని ఈ బృందం, యాంటీబాడీస్ స్థాయిలు మాత్రమే టీకా ప్రభావాన్ని అంచనా వేయవు. జనాభా అధ్యయనాలు కూడా అవసరమని గుర్తించారు. దిగువ తటస్థీకరించే యాంటీబాడీ స్థాయిలు ఇప్పటికీ కోవిడ్ నుండి రక్షణతో ముడిపడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు మోతాదులను పొందిన 250 మంది ఆరోగ్యకరమైన వ్యక్తుల రక్తంలో ప్రతిరోధకాలను అధ్యయనం చేశారు. వారి మొదటి మోతాదు తర్వాత మూడు నెలల వరకు వారి శరీరాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఐదు వేర్వేరు వైవిధ్యాలకు వ్యతిరేకంగా, ‘న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్’ అని పిలువబడే కణాలలోకి వైరస్ ప్రవేశించడాన్ని నిరోధించే ప్రతిరోధకాల సామర్థ్యాన్ని పరిశోధకులు పరీక్షించారు. ఇలా పోల్చినప్పుడు B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా ఐదు రెట్లు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

అయితే, తాజాగా ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ రూపొందించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ 12-15 ఏళ్ల మధ్య గల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్‌ రెగ్యులేటరీ సంస్థ ధ్రువీకరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ జూన్‌ రైన్‌ వెల్లడించారు.

వైరస్ వల్ల కలిగే ప్రమాదాలను ఈ వ్యాక్సిన్ అధిగమిస్తోందని రైన్‌ చెప్పారు. సుమారు 2వేల మందికి పైగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్‌ను అతి జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలిపారు. 16-25 వయసు వారిలో కనిపించిన విధంగానే 12-15 ఏళ్ల చిన్నారుల్లోనూ యాంటీబాడీలు వృద్ధి చెందాయని చెప్పారు. అయితే, ప్రస్తుత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఈ వయసు పిల్లల గురించి వ్యాక్సినేషన్‌, ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాయింట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని రైన్‌ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, కరోనా విలయతాండవానికి అల్లాడిపోతోన్న ఇండియాను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్‌కు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సకు అవసరమైన మందులను ఫైజర్‌ భారత్‌కు ఉచితంగా పంపిస్తోంది. ఇండియాలో కరోనా పరిస్థితులపై ఫైజర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్లిష్టమైన సమయంలో ఇండియాకు అండగా ఉంటామని వెల్లడించింది. కరోనా కష్ట కాలంలో భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిన సమయంలో ఫైజర్‌ సాయం చేయడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చింది.

మరోవైపు, ఎలాంటి లాభాపేక్ష లేకుండానే టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గత నెలలోనే ప్రకటించింది ఫైజర్‌. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చాలాసార్లు సంప్రదింపులు కూడా జరిపింది. అటు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతిస్తామని ఇదివరకే వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది ఫైజర్‌.

Read Also….  Covid 19 Vaccine: అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. 22 కోట్ల మందికి అందిన టీకా