Black Fungus : కోవిడ్ బారినపడిన ఈ వ్యాధి గ్రస్తుల నోరు శుభ్రత లేకపోతే ముప్పు తప్పదంటున్న వైద్య బృందం
Black Fungus : కరోనా నివారణకు రక్షణకు చేతులకు శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తుండాలి అన్నది ఎంత నిజమో.. దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోలి అన్నది అంత..
Black Fungus : కరోనా నివారణకు రక్షణకు చేతులకు శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తుండాలి అన్నది ఎంత నిజమో.. దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోలి అన్నది అంత ముఖ్యమని .. దంతాల ఆరోగ్యానికి.. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కి మధ్య సంబంధం ఉందని కేరళ రాష్ట్ర ఐఎంఏ పరిశోధన విభాగంతెలిపింది. అంతేకాదు బ్లాక్ ఫంగస్ నుంచి రక్షణ కోసం తప్పని సరిగా దంతాలు, చిగుళ్లను శుభ్రంగా చేసుకోవాలని.. అప్పుడు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకడానికి తక్కువ అవకాశం ఉంటుందాని చెప్పారు.
కొవిడ్ వ్యాధిగ్రస్థుల్లో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. అయితే ఈ ఫంగస్ రోగ నిరోధక శక్తి తగ్గినవారికే సోకుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, అవయవ మార్పిడి జరిగిన వారికి ఎక్కువ శాతం సోకె అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ లో వ్యాధి తీవ్రమైన సమయంలో వ్యాధి కారకాలపై పోరాడేశక్తి శరీరంలోని కణాలకు తగ్గిపోతుంది.
శరీరంలో చక్కెర, జింక్ లాంటివి ఎక్కువైతే అవి ఈ ఫంగస్ పెరగడానికి దోహదపడతాయి. అలాగే మృత కణాలు పేరుకుపోయినా అందులోనూ ఫంగస్ పెరుగుతుంది. తర్వాతి దశలో ఫంగస్ మన రక్త కణాల్లోకి చొరబడుతుంది. అప్పుడు కణాలకు రక్తం అందక అవి మరణించి నల్లగా మారిపోతాయి. అందుకే మ్యూకర్‌మైకోసిస్‌ను ‘బ్లాక్ ఫంగస్’గా పిలుస్తారని వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ పళ్లు, చిగుళ్లను సరిగా శుభ్రం చేసుకున్నప్పుడు సంభవించడానికి తక్కువ అవకాశం ఉంటుంది.
టీకా తీసుకున్నవారిలో కొవిడ్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. మందులు వాడాల్సిన అవసరం ఉండదు. దీంతో స్టెరాయిడ్స్ వాడటం వల్ల వచ్చే ఫంగస్ ముప్పు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అయితే స్వల్ప లక్షణాలతో ఉన్న కొవిడ్ దానంతట అదే తగ్గిపోయేలా చూసుకోకుండా.. ఎవరైనా స్వీయ వైద్యం చేసుకొని, అవసరం లేని మందులు వాడితే అప్పుడు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. కనుక దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు.. షుగర్ వ్యాధిని కూడా నియంత్రిచుకోవాలని.. వైద్య బృందం సూచిస్తున్నారు.
Also Read: ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం