విశాఖలోని కింగ్‌ జార్జ్ ఆసుపత్రిలో దారుణం.. బాత్రూంకి వెళ్లి చనిపోయిన కోవిడ్ పేషెంట్.. సిబ్బంది ఏం చేశారంటే

ఉత్తరాంధ్రకే తలమానికైన విశాఖలోని కింగ్‌ జార్జ్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి డెడ్‌ బాడీ గంటల తరబడి ఆస్పత్రి బెడ్‌పైనే.......

విశాఖలోని కింగ్‌ జార్జ్ ఆసుపత్రిలో దారుణం.. బాత్రూంకి వెళ్లి చనిపోయిన కోవిడ్ పేషెంట్.. సిబ్బంది ఏం చేశారంటే
covid dead body
Follow us

|

Updated on: May 03, 2021 | 10:34 AM

ఉత్తరాంధ్రకే తలమానికైన విశాఖలోని కింగ్‌ జార్జ్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి డెడ్‌ బాడీ గంటల తరబడి ఆస్పత్రి బెడ్‌పైనే ఉండటం గమనించిన మిగతా పేషెంట్స్‌ బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు తోడేస్తున్న కరోనా టైమ్‌లో …ఓ యువకుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు కోవిడ్ అని నిర్ధారించి..అతడ్ని కేజీహెచ్‌లోని CSR నెంబర్‌2లో బెడ్‌ నెంబర్‌9 కేటాయించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్ పొందుతున్న యువకుడు తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లి..అక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కేజీహెచ్ వైద్య సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తరలించి..చివరి కార్యక్రమాలు పూర్తి చేయాల్సింది పోయి…మృతదేహాన్ని తీసుకొచ్చి తిరిగి అతని బెడ్‌పైనే ఉంచారు.

అందరితో పాటే బెడ్‌పై ఉన్న వ్యక్తి బ్రతికి లేడని తెలుసుకున్న తోటి రోగులు హడలిపోయారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని దూరంగా తీసుకెళ్లి ఖననం చేయాల్సింది పోయి…మృతదేహాన్ని చికిత్స పొందుతున్న వారి మధ్యలో ఉంచడంతో కరోనా రోగులు మరింత భయాందోళనకు గురయ్యారు. బెడ్‌పై మృతదేహం ఉన్న దృశ్యాల్ని వీడియో తీసి తమ బంధువులకు విషయాన్ని చేరవేశారు. ఎలాగైన వెంటనే డెడ్‌బాడీని వార్డులోంచి మార్చురీకి తరలించేలా చూడాలని బంధువుల్ని వేడుకున్నారు.

కేజీహెచ్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మారిన ఈ దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలోని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఈ రాశివారికి ఈ రోజు వచ్చే బాకీలు వసూలు అవుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం

కొల‌నులో చిక్కుకున్న బుల్లి ఏనుగు.. అటుగా ప‌రిగెత్తుకొచ్చిన సింహం.. ఇంత‌లో జ‌రిగింది అద్భుతం