Viral Video: కొలనులో చిక్కుకున్న బుల్లి ఏనుగు.. అటుగా పరిగెత్తుకొచ్చిన సింహం.. ఇంతలో జరిగింది అద్భుతం
సింహం అడవికి రాజు. దాని గర్జన వింటేనే దగ్గర్లో ఉన్న మిగతా జంతువులు తోకముడిచి పారిపోతాయి. ఏనుగులు, ఒంటెలు వంటి బలమైన జంతువులు కూడా మందగా....

సింహం అడవికి రాజు. దాని గర్జన వింటేనే దగ్గర్లో ఉన్న మిగతా జంతువులు తోకముడిచి పారిపోతాయి. ఏనుగులు, ఒంటెలు వంటి బలమైన జంతువులు కూడా మందగా వాటికి ఎదురు నిలుస్తాయి తప్పితే.. ఒంటరిగా పోరాటం చేయలేవు. అలాంటిది ఓ బుజ్జి ఏనుగు కొలనులో చిక్కుపోయింది. తన తల్లి తన బిడ్డను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ కుదరడం లేదు. ఇదే క్రమంలో పరిస్థితిని గమనించిన సింహం అటువైపు పరిగెత్తుకుంటూ రావడం ప్రారంభించింది. దీంతో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు బెంబేలెత్తిపోయాయి. సింహం ఆ పిల్ల ఏనుగును చేరుకోకముందే, ఏనుగుల రెండవ కుటుంబం అక్కడకు చేరుకుంటుంది. సింహం దానికి హాని చేయకుండా కాపు కాస్తాయి. ఏనుగులన్నీ కలిసి నీటి కొలను నుండి చిన్న ఏనుగును బయటకు తీయడానికి సహాయపడతాయి. అది చివరకు సురక్షితంగా బయటకు వస్తుంది. ఇందులో చాలా ఏనుగులు కలిసి ఒక చిన్న ఏనుగు ప్రాణాలను కాపాడటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సదరు వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.
వీడియో చూడండి-
A tiny baby elephant got trapped in a water trough, and lions were closing in — when the most amazing thing happened ?? pic.twitter.com/FCVgvsRsGe
— Nature & Animals? (@AnimalsWorId) May 1, 2021
నేచర్ & యానిమల్స్ అనే ఖాతాతో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. అయితే, దీనిని మొదట ది డోడో సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడతారు. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ప్రజలు దీనిని చూశారు. ప్రజలు దీన్ని ఒకరికొకరు పంచుకోవడమే కాదు, దానిపై వివిధ కామెంట్లు పెడుతున్నారు. ‘ఐక్యతలో బలం ఉంది’ అనే దానికి ప్రజలు దీనిని ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించారు.
Also Read: 18వ రోజూ అదే తీరు.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
